బుడమేరుపై కొత్త ప్లాన్స్.. ప్రకటించిన నారా లోకేష్
బుడమేరు ముంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యుద్దప్రాతిపదికన బుడమేరు గండ్లను పూడ్చే పనులను కూడా ముగించారు.
బుడమేరు ముంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యుద్దప్రాతిపదికన బుడమేరు గండ్లను పూడ్చే పనులను కూడా ముగించారు. కాగా భవిష్యత్తులో ఇటువంటి ముంపు మరోసారి సంభవిచంకుండా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్టికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయంతో చేసుకుంటూ బుడమేరు వరద ఉద్ధృతిపై నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులను మరింత వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. గండ్లు పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతో సీపేజ్ లీకేజీ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు వరద నీరు తగ్గిందని వివరించారు. లీకేజీని పూర్తిస్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాల మేరకు లీకేజీని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మెంబ్రేన్ షీట్ వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయంత్రానికి లీకేజీని పూర్తిగా నిలిపేసినట్లు తెలిపారు.
కట్ట ఎత్తు పెంచేలా పనులు
‘‘వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంపును చేపట్టగా మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తి అవుతాయి. బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు డ్రోన్‌ల సహాయంతో పర్యవేస్తున్నాం. వాటిని మరింత వేగవంతం చేసేలా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదే విధంగా వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహారం అంచనాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం’’ అని వెల్లడించారు.
వీటికి వైసీపీ పాపాలే కారణం..
‘‘వైసీపీ చేసిన పాపానికే బెజవాడ మునిగింది. బుడమేరు కట్ట మీద మట్టిని దోచుకెళ్లారు. పడవలు తెచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. 9 రోజులుగా కలెక్టరేట్‌లోనే ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నరు చంద్రబాబు. కేంద్ర మంత్రులను పిలిపించి వారికి ఇక్కడి పరిస్థితులను, ప్రజల అవస్థలను వివరించారు. వైసీపీ తాము అధికారంలో ఉన్న కాలంలో బుడమేరు ఆధునికీకరణ పనులను ఆపేయకపోయి ఉన్నా. ప్రాజెక్టుల నిర్వహణను సక్రమంగా నిర్వర్తించి ఉన్నా బెజవాడకు ఈ రోజు ఇలాంటి అవస్థ వచ్చిచ ఉండేది కాదు’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మరోవైపు వరద బాధిత ప్రాంతాలకు ప్రకటించిన విరాళాల చెక్కులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంపిణీ చేశారు.
గ్రామాలకు అందిన చెక్కులు
రాష్ట్రవ్యాప్తంగా వరదల పీడిత పంచాయతీలకు తన తరుపున ఒక్కో పంచాయతీకి రూ.లక్ష విరాళం ప్రకటించారు డిప్యూటీ సీఎం పవర్ కల్యాణ్. ఈ మేరకు మొత్తం 400 పంచాయతీలకు విరాళ చెక్కులను ఈరోజు అందించారు పవన్. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో వరద పీడిత పంచాయతీలకు విరాళ చెక్కులను ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు అందించారు. పవన్ కల్యాణ్‌కు బాధిత కుటుంబాలు రుణపడి ఉంటాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం నియోజకవర్గంలోని 31 పంచాయతీలకు ఈరోజు చెక్కులు అందించామని ఎమ్మెల్యే తెలిపారు.