వైసీపీ ఓడిపోతోందని మోదీ ఎందుకన్నట్టు?
x

వైసీపీ ఓడిపోతోందని మోదీ ఎందుకన్నట్టు?

ఆంధ్ర ఎన్నికల్లో విజేత ఎవరు? బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఏంటి? ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..


ఏపీ రాజకీయాలు మహారంజుగా మారుతున్నాయి. మరో రెండు రోజుల్లో పోలింగ్ కూడా జరగనుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి సంబంధించిన ఇంర్వ్యూ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. అందులో ఆంధ్రలో జగన్ గెలుపుపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న సంబంధం, పార్లమెంటు బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు వైసీపీ మద్దతు తెలపడానికి అసలు కారణం ఇలాంటి మరెన్నో విషయాలను ఆయన వెల్లడించారు. పోలింగ్ ముందు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జగన్ భవితవ్యాన్ని మోదీ కనిపెట్టేశారని, జగన్‌కే ఏమీ అర్థం కావట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. అసలు ఇంతకీ ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

‘‘ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఇప్పుడున్న ప్రభుత్వమే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఆంధ్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు. దాని ప్రభావం కింద స్థాయి వరకు ఉంది. జగన్.. మా రాజకీయ మిత్రపక్షంగా ఎన్నడూ లేరు. పార్లమెంటులో అయితే అంశాలను బట్టి మాకు మద్దతు ఇచ్చారు. మేము ఇదివరకు కూడా ప్రత్యర్థులుగానే ఎన్నికల్లో తలబడ్డాము. ఎన్నికల సమయంలో మేము ఎప్పుడూ ప్రత్యర్థులమే. జగన్.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే.. నేను దేశ ప్రధానిని. ఒక ప్రధానిగా నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను. పార్టీలతో సంబంధం లేదు.. రాష్ట్ర పురోగతి కోసం తోడ్పాటు అందిస్తాను. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహాయం చేయగలం అనే ఆలోచిస్తాను. ఆంధ్ర విషయంలో కూడా అదే చేశాను. అది బాధ్యత కూడా. దేశం పట్ల నాకు ఉన్న విజన్‌లో ఏ రాష్ట్రాన్ని విడిచి పెట్టేది లేదు. అన్ని రాష్ట్రాలని కలుపుకుని వెళ్లడమే ఉంది’’ అని వివరించారు.

‘‘ఇక ఎన్నికల అంశానికి వస్తే టీడీపీ పార్టీ గతంలో ఎన్‌డీఏ కూటమిలో సభ్య పార్టీగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా మాతో కలిసింది. కూటమికి ఆంధ్రలో లభిస్తున్న ఆదరణ కూస్తుంటే పక్కాగా ఆంధ్రలో ఈసారి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా లోక్‌సభలో కూడా అత్యధిక సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read More
Next Story