ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు గుక్క తిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఓటమి గురించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాల గురించి వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల్లో కానీ, తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కానీ తనను ఎవ్వరూ ఓడించ లేదని, తానే ఓడిపోయానని వెల్లడించారు. తాను తీసుకున్న నిర్ణయాలతో పాటు తానే ఓటమి కారణమని పేర్కొన్నారు. పని చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో పరుగెత్తానని, పని అనేది తనకు ఒక వ్యసనంలా మారిపోయిందన్నారు. అది సాధించాలని, ఇది సాధించాలని పరుగెత్తాను. దీంతో కొద్దిగా ఎమ్మెల్యేలకు సంబంధించినది కానీ, పార్టీకి సంబందించినది కానీ, పనులు చేయడంలో కొద్దిగా అశ్రద్ధ జరిగింది. పని ఒత్తిడి ఎక్కువుగా ఉండటం వల్ల అవి సరిగా చేయలేక పోయాను. అవి కూడా చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన తప్పులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే పద్ధతిలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో.. ఆ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలతో పరుగు ఎక్కువైంది. వాటిని ఒక వైపు పరిష్కారం చేస్తూనే.. దీంతో పాటుగా దీర్ఘకాలికంగా ఏమి చేయబోతున్నామనే అంశాలను వారికి చెబుతూనే.. ప్రజలను కూడా భాగస్వాములను చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి. గుక్క తిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవి చేస్తూనే.. ఇవన్నీ చేయాలంటే మళ్లా సంపద సృష్టించాలి. ఆదాయం పెంచాలి. ఆ ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయాలి. మళ్లీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాలంటూ మాట్లాడారు.
ఒక్కోసారి అన్ని ఆలోచిస్తారు. ఏదో ఆ తాత్కాలిక వచ్చినటువంటి కొంత మంది చెప్పే మాటలు కూడా విని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే వాటి మీద ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయం మాట్లాడటం లేదు. అందుకే ఇప్పుడు నేను ఒక నిర్థిష్టమైన ఆలోచనలతో ఉన్నాను. రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారని అంటారు. అందుకే రాజకీయం మాట్లాడటం లేదు. అది నాకు అనవసరం కూడా. మంచి రాజకీయం.. మంచి పరిపాలన.. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలతో పని చేస్తున్నా. ప్రజలకు మేలు చేస్తే.. ఆ మేలును మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారు. ఆ విశ్వాసం నాకు ఉంది. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి. అందుకు మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. మనం మంచి పని చేయడమే కాకుండా.. మంచి పని చేసే విధానం, ప్రజలతో మమేకం కావడం చేయాలి. అలా చేస్తే ప్రజలు కూడా మనలను నమ్ముతారు. మెచ్చుకుంటారు. అంటూ సభ్యులకు దిశా నిర్థేశం చేశారు. సంపద సృష్టించాం.. ఆ ఆదాయం కొంత మంది చేతుల్లోకి వెళ్లింది. చాలా మంది జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. అభివృద్ధి జరగలేదు. అందుకే సమగ్ర అభివృద్ధి చాలా ముఖ్యం. దీని కోసం జీరో పావర్టీ, పీ4 విధానాలను అమలులోకి తెస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అయితే చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో చెప్పిన 2004 ఎన్నికల్లో నాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి చవిచూసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
Next Story