ఉత్తరాంధ్ర రచయిత ముత్యం మృతి
x

ఉత్తరాంధ్ర రచయిత ముత్యం మృతి

ఆయన ప్రముఖ రచయిత మాత్రమే కాదు సాహితీవేత్త, సాహిత్య పరిశోధకులు కూడా


ప్రముఖ సాహితీవేత్త, శ్రీకాకుళం విప్లవ సాహిత్య పరిశోధకులు, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ సాహిత్య సాంస్కృతిక పరిశోధక రచయిత కె. ముత్యం హైదరా బాద్ లో మరణించారు.

ఆయన అర్ధరాత్రి గడిచిన తర్వాత ఈ తెల్లవారుజాము 2 గంటలకు గుండెపోటుతో మరణించిన విషయం ఆయన సహా రచయిత R. శివలింగం ద్వారా ఇప్పుడే తెలిసిందని ఇఫ్టూ ప్రసాద్ తెలిపారు.

నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘానికి PDSU తరపున ముత్యం అధ్యక్షులు గా ఉన్నారు. బెనారస్ యూనివర్సిటీ విద్యార్థి కూడాను. అనేక పుస్తకాలు రచించారు. ముత్యం కథలు పేరుతో కూడా ఒక సంకలనం వెలువడింది. శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు.

బ్రెయిన్ స్ట్రోక్ తో మూడేండ్లుగా అస్వస్థతకు గురై భౌతికంగా విశ్రాంతిలో ఉంటున్నారు. ఈ కాలంలో కూడా బెడ్ రెస్ట్ తీసుకుంటూ రచనా వృత్తిని సాగిస్తూ వచ్చారు.

పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

డా|| కె ముత్యం సంతాప సభ

ప్రముఖ పరిశోధక రచయిత డాక్టర్ కే. ముత్యం ప్రజా సంఘాలు, సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో సాయంత్రం ఐదు గంటలకు సంతాప సభ నిర్వహిస్తున్నారు.






Read More
Next Story