
అభం, శుభం పసికందును అంత ఘోరంగా చంపాల్నా..
'వీడేం తండ్రిరా బాబూ, 8 నెలల పసికందును ఇంత ఘోరంగా చంపాడు' అని అందరూ శపిస్తుంటే అతడేమో పరారీ అయ్యాడు.
'వీడేం తండ్రిరా బాబూ, 8 నెలల పసికందును ఇంత ఘోరంగా చంపాడు' అని అందరూ శపిస్తుంటే అతడేమో పరారీ అయ్యాడు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఈ దారుణం జరిగింది.
దేవనకొండ లో నరేశ్ అనే అతను శ్రావణి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం కాపురం బాగానే సాగింది. ఓ పిల్లాడు కూడా పుట్టాడు. ఇంతలో నరేశ్ కి ఏమి తిక్కరేగిందో తెలియదు. భార్యతో గొడవ పడ్డాడు. కట్టుకున్న వాడు గనుక చేసేది లేక ఆమె సహిస్తూనే వచ్చింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 11 మధ్యాహ్నం భార్యను, ఆ 8 నెలల పసికందును తీసుకుని పొలం వెళ్లాడు.
అక్కడ ఆ 8 నెలల కుమారుణ్ణి తండ్రి నరేశ్ నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత చేలోని నీటి డ్రమ్ములో వదిలేశాడు. అంతటితో ఆగకుండా భార్య శ్రావణిని విచక్షణారహితంగా కొట్టి గొంతుపిసికి చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఆమె చనిపోయిందనుకుని పొలంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి శ్రావణి అత్తమామలకు పొలం వెళ్లి చూస్తే ఆమె కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. ఆమెను అత్తమామలు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉంది.
గతంలో మొదటి భార్యను కూడా నరేశ్ చిత్రహింసలకు గురిచేసి చింపేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇతనో అనుమానపు పక్షని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పసికందును చంపిన తీరుపై ఊరు ఊరంతా అతన్ని శపిస్తున్నారు.
Next Story