
TTD Updat | పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం
ఆన్లైన్ టోకెన్ల జారీకి టీటీడీ పాలకమండలి నిర్ణయం.
తిరుమలలో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించడానికి వీలుగా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి ప్రత్యేక counters లేకుండా online పద్ధతిలో టోకెన్లు జారీ చేయాలని Ttd పాలకమండలి సమావేశంలో మంగళవారం నిర్ణయించారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం ఈనెల 27వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు టిటిడి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్ పద్ధతిలో ఎంపిక చేసిన తర్వాత డిసెంబర్ రెండో తేదీ టోకెన్లు జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు మీడియాకు చెప్పారు.
ఈ సంవత్సరం డిసెంబర్ 30వ వైకుంఠ ఏకాదశి, 31 న వైకుంఠ ద్వాదశికి తోడు 2026 జనవరి మొదటి తేదీ కూడా కలిసి రావడం వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనాల కోసం యాత్రికులకు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా టోకెన్లు జారీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
టిటిడి పాలకమండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రిజిస్ట్రేషన్.. టికెట్ల కేటాయింపు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు పారదర్శకంగా టికెట్లు జారీ చేయాలనే పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలిపారు.
"ఈ సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు అంటే మూడు రోజులు శ్రీవారి దర్శనానికి ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించాలని నిర్ణయించాం. టోకెన్ల కోసం ఈనెల (నవంబర్) 27వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు టీటీడీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారికి డిప్ పద్ధతిలో ఎంపిక చేసి, డిసెంబర్ రెండో తేదీ టోకన్లో కేటాయిస్తాం" అని టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు వెల్లడించారు.
ఆన్లైన్ టోకెన్లు ఉంటేనే..
ఈ సంవత్సరం 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరానికి సంబంధించి టీటీడీ ఆన్లైన్ లో టోకెన్లు జారీ చేస్తుంది. ఈ మూడు రోజులు టోకెన్లు తీసుకున్న వారిని వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో టీటీడీ పాలకు మండలి సమావేశం అనంతరం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులతో కలిసి చైర్మన్ బిఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పారు.
"మొత్తం పది రోజుల్లో 240 గంటలు అందుబాటులో ఉంటే, తిరుమలలో శ్రీవారికి నిర్వహించే నిత్య కార్యక్రమాలను మినహాయిస్తే, శ్రీవారి దర్శనానికి 182 గంటలు ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య యాత్రికుల దర్శనానికి కేటాయించాం"అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు చెప్పారు.
ప్రత్యేక కౌంటర్లు లేవు..
తిరుమలలో "వైకుంఠ ద్వారం" దర్శనాలకు టిటిడి ఏడాది జనవరిలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం జనవరి 9వ తేదీ జరిగిన తొక్కి సలాటలో ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ పరిస్థితిని నివారించడానికి టిటిడి ప్రస్తాపాలక మండలి చైర్మన్ బి.ఆర్ నాయుడు సారధ్యంలోని సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
"ప్రత్యేక కౌంటర్ల స్థానంలో రోజు తిరుపతి నగరం అలిపిరికి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని శ్రీనివాసం వసతి గృహాల సముదాయంలో జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్లు తీసుకుని వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే విధంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం". అని చైర్మన్ బి.ఆర్ నాయుడు చెప్పారు.
శ్రీవాణి టిక్కెట్లు మూడు రోజులు రద్దు
తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచే 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు 300 రూపాయల టికెట్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీ మూడు రోజుల పాటు రద్దు చేశారు. 2026 జనవరి రెండో తేదీ నుంచి 8వ తేది వరకు రూ. 300, శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియ యథాధిగానే కొనసాగుతుందని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల వాసుల కోసం..
తిరుపతి, తిరుమలలోని స్థానికుల కోసం వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు జారీ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలిపారు.
"టిటిడి వెబ్సైట్, యాప్, వాట్సప్ ద్వారా పారదర్శకంగా టోకన్లు జారీ చేస్తాం. దీనికోసం రిజిస్ట్రేషన్ అమలులోకి తెచ్చాం" అని బి ఆర్ నాయుడు వెల్లడించారు.. తిరుపతి, తిరుమల నివాసితులకు 2026 జనవరి 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు రోజుకు 5 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి. ముందు ప్రాతిపదికన టోకన్లు జారీ చేస్తామని ఆయన వివరించారు.

