దుమారం రేపుతోన్న పవన్‌ కల్యాణ్, కన్నబాబు వ్యాఖ్యలు
x

దుమారం రేపుతోన్న పవన్‌ కల్యాణ్, కన్నబాబు వ్యాఖ్యలు

పీఆర్పీ నుంచి 2009లో గెలిచిన కురసాల కన్నబాబు. చిరంజీవిని సీఎం జగన్‌ అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఉన్నావని పవన్‌ వ్యాఖ్యలు.


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, కాకినాడ రూరల్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పరస్పరం ఒకరిపై ఒకరు కాకినాడ వేదికగా చేసుకున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో ఇవి కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు డొక్కు స్కూటర్‌పై మా చుట్టు తిరిగే వాడవి, అన్నయ్య చిరంజీవి పెట్టిన భిక్ష వల్లే ఎదిగావని కన్నబాబుపై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించగా, నీ క్వాలిఫికేషన్‌ ఏమిటి, కేవలం టెన్త్, ఆయన మాట్లాడేదంతా ఊర వాగుడని కన్న బాబు పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డాడు. తాజాగా ఇది రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

కన్నబాబు డొక్కు స్కూటర్‌పై మాటు చుట్టూ తిరిగాడు

కాకినాడ రూర్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో నాకు చాల ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాద్ధ కాలంగా రోడ్ల మీద తిరుగుతూ నలుగుతున్నానంటే దానికి కారణం ఈయన కూడా. 2009లో స్థాపించిన ఆర్‌ఆర్‌పీకి నేను వ్యవస్థాపక సభ్యుడిని. నాడు పీఆర్‌పీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి మూలకారకుడు కన్నబాబు. కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్‌లో తిరిగే వ్యక్తి మా దగ్గర . డొక్కు స్కూటర్‌లో మా చుట్టూ తిరిగే వాడు. కన్నబాబు ఇలా రా అంటే పరుగెత్తుకొని వచ్చే వ్యక్తి. అన్న చిరంజీవికి ఏదైనా చిన్న సమాచారం కావాలంటే ఇచ్చే వ్యక్తి కన్నబాబు. అంచెల అంచెలుగా నాయుకుడిగా ఎదిగాడు కన్నబాబు. నాయకులుగా ఎదగడంలో మాకేమి ఇబ్బంది లేదు. నాయకులుగా ఎదగాలి కూడా. కానీ ఎట్‌ వాట్‌ కాస్ట్‌ .. ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావనేదే చాలా కీలకమైంది. అన్న చిరంజీవి పెట్టిన భిక్షతోనే కన్నబాబు రాజకీయ నేతగా ఎదిగారు. చిరంజీవి అన్నయ్య పడేసిన భిక్షను తీసుకొని ఎదిగాడు. అన్న చిరంజీవిని, సినిమా హీరోలు మహేష్‌ బాబు, ప్రభాస్‌లను పిలిపించి వారు సీఎం జగన్‌ను బతిమాలుకున్నట్లు వీడియోలు చిత్రీకరించి, వారి పట్ల ఎలాంటి మర్యాద లేకుండా సీఎం జగన్‌ అహంకారంతో ప్రవర్తించారు. దీనికి కారణం కురసాల కన్నబాబే. అన్నయ్య చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌లను సీఎం జగన్‌ అవమానిస్తుంటే ఎలా చూస్తూ ఉన్నావు, సిగ్గుందా కన్నబాబు నీకు. ఏమి బతుకు నీది. చిరంజీవి పెట్టిన భిక్ష నీకు గుర్తుకు రాలేదా అంటూ కురసాల కన్నబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ కల్యాణ్‌ది ఊర వాడుగు

పవన్‌ కల్యాణ్‌ ఊర వాగుడు వాగుతున్నారు. నోటికొచ్చినట్లు తిట్టారు. సంస్కారం అనేది లేదు అన్నట్లుగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. సీఎం వద్దకు సినీమా నిర్మాతలు కాకుండా హీరోలు ఎందుకు వెళ్లారు. అసలు ఆ విషయమే నాకు తెలియదు. సీఎం ఎవరికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు, ఎవరు కలిసారనేది కూడా నాకు తెలియదు. సంబంధం లేకుండా చిత్ర విచిత్రంగా మాట్లాడారు పవన్‌ కాల్యాణ్‌. నీ ఊగుడు, వాగుడు చూస్తోంటే ప్రజలకు అనుమానం వస్తోంది. ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడేస్తారా. పీఆర్పీ పెట్టినప్పుడు చిరంజీవికి క్లోజ్‌గా పని చేశాను. కానీ పవన్‌ కల్యాణ్‌ నన్ను పోషించినట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. ఆయన దయాదాక్షిణ్యాలపై నేను బతికినట్లు మాట్లాడుతున్నారు. నాకు బతుకుదెరువు లేక ఆయన వద్ద చేతులు కట్టుకొని నిలబడ్డట్టు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. మాట్లాడటం ఆయనకే హక్కు అన్నట్టుగా మాట్లాడుతారు. నేనేదో డొక్కు స్కూటర్‌ వేసుకొని వచ్చినట్లు, ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడినట్టు పవన్‌ కల్యాణ్‌ సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. నేను జర్నలిస్టుగా పని చేశాను. 1995 నుంచే దాయపన్ను చెల్లిస్తున్నా. ఈనాడులో ఉద్యోగం వదిలేసే సమయానికి అంటే 2008 నాటికి నా జీతం లక్ష రూపాయలు. వాళ్లు పిలిస్తేనే వెళ్లాను. నేను టచ్‌ బాయ్‌ని కాదు. గొడుకు పట్టుకునే వ్యక్తిని అసలే కాదు. పార్టీ పెట్టినప్పుడు పవన అక్కడ చిరంజీవి తమ్ముడు మాత్రమే. ఆ పార్టీలో నువ్వు కూడా పని చేశావు. అంతకు మించి నీకు నాకు ఏ సంబంధం లేదు. చిన్న స్థాయి నుంచి జర్నలిస్టుగా ఎదిగా. నీ క్వాలిఫికేషన్‌ ఏమిట?, టెన్త్‌ క్లాస్‌ని వ్యాఖ్యానించారు. చిరంజీవి నాకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్‌ అంటున్నాడు, కానీ నేనది దీవెన అనుకుంటున్నా. నీ ప్రొఫెషన్‌ ఎవరేసిన భిక్ష?. చిరంజీవి వేసిన భిక్ష కాదా? ఆ విషయం ఒక్కరోజైనా చెప్పావా అంటూ నిలదీశారు. చిరంజీవి వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యానని నేను చెప్పుకుంటున్నా అన్నారు. ప్రజారాజ్యం విలీనానికి ఎవరు కారణమో.. ఎవరి వల్ల అది విలీనం అయ్యిందో చిరంజీవిని అడగొచ్చు కదా అని పవన్‌ కాల్యణ్‌పై కన్న బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read More
Next Story