నామినేషన్ దాఖలు చేసిన పవన్  కల్యాణ్..
x

నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్..

జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి..


పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడి నుంచి గెలవాలని వైసీపీ తరపు వంగా గీత పోటీ చేస్తుంటే ఎలాగైనా పిఠాపురం ఎమ్మెల్యే విజయం సాధించాలని జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పిఠాపురంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎండీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు.

భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కల్యాణ్

గోల్లప్రోలు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి దగ్గర నుంచి పవన్ కల్యాణ్.. ర్యాలీగా రిటర్నింగ్ అధికారి దగ్గరకు వెళ్లారు. ఈ ర్యాలీలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌కు జైజైలు కొట్టారు. ఈసారి పవన్‌దే గెలుపంటూ నినాదాలు చేశారు. 2024లో గాజు గ్లాసు సుడిగాలికి సీలింగ్ ఫ్యాన్ కనుమరుగవడం ఖాయమంటూ జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story