లడ్డూ వివాదం నుంచి పవన్‌ కళ్యాణ్ ను ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా మరో ట్వీట్‌ చేశారు. పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఫుట్‌బాల్‌ లాంటి వారని అన్నారు.


శ్రీవారి లడ్డూ వివాదం తెరపైకి తెచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ వెంటాడుతూనే ఉన్నారు. లడ్డూ వివాదం అడ్డం పెట్టుకొని ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య మత విద్వేషాల రెచ్చగొడుతున్న విధానంపై గళమెత్తుతూనే ఉన్నారు. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. సామాజిక మాధ్యమమైన ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలను ప్రస్తావిస్తూ సోమవారం మరో ట్వీట్‌ చేశారు. రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌ ఫుట్‌బాల్‌ లాంటి వారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని పోస్టు పెట్టారు. దీని కంటే ముందు ఒక పోస్టు పెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆల్‌ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌(ఎంజీఆర్‌)ను పొగుడుతూ పవన్‌ కళ్యాణ్‌ తన సోషల్‌ మీడియా ఎక్స్‌ అకౌంట్‌ నుంచి ఒక పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ప్రకాష్‌ రాజ్‌ ఎంజీఆర్‌పై హఠాత్తుగా ఎందికింత ప్రేమో.. పై నుంచి ఆదేశాలు అందాయా.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన పోస్టును దీనికి జత చేశారు.
ఎంజీఆర్‌ గురించి పవన్ కళ్యాణ్‌ పెట్టిన పోస్టు మీద ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు, పవన్‌ కళ్యాణ్‌ ఈజ్‌ ఏ ఫుట్‌ బాల్‌ ఇన్‌ పాలిటిక్స్‌..గెట్టింగ్‌ కిక్డ్‌ బై ఆల్‌ అనే పోస్టులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఫుట్‌ బాల్‌తో పోల్చారు, ఎవరు కిక్‌ కొడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
Next Story