చాలా రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వ పెద్దలు భేటీ అవుతున్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు భేటీ కావడం కీలకంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వ రథ సారధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు సోమవారం భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి పవన్‌ కళ్యాణ్‌ వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీరద్దరి భేటీ మీద ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేయడం, అక్కడ బీజేపీ కూటమి గెలవడం, తర్వాత ఢిల్లీ పర్యటనలు, ప్రధాన మోదీతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కలవడం, కాకినాడలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటించడం, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాని నిలదీయడం వంటి పలు అంశాలు చోటు చేసుకున్నాయి.

చాలా రోజుల తర్వాత వీరద్దరి భేటీ ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. వీరిద్దరి భేటీలో ఏ అంశాలపై చర్చస్తారో అనేది ఆసక్తిగా మారింది. మంత్రి వర్గ సమావేశం ముందు వీరిద్దరి భేటీ కీలకంగానూ మారింది. ప్రధానంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు కాకినాడ పోర్టు వ్యవహారంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేబెనెట్‌లో తీసుకోవలసిన నిర్ణయాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే కేబినెట్‌ సమావేశం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 4న జరగాల్సి ఉంది. అయితే ఆ షెడ్యూల్‌ను ఒక రోజు ముందుకు మార్చుతూ డిసెంబరు 3న నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కేబినెట్‌ నిర్వహించనున్నారు.
Next Story