కాకినాడ ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా..
x

కాకినాడ ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా..

తుపాను గురించి భయపడొద్దంటున్న పవన్ కల్యాణ్


మొంథా తుపాను (Cyclone Montha)ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందని తేలడంతో ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

‘మొంథా’ తుపాను గమనం, తీరం దాటే విషయంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు ఏవీ లేవన్నారు. కాకినాడ సమీపంలోనే తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. కాకినాడ ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. సహాయ, పునరావాస చర్యల్లో ఎటువంటి అశ్రద్ధ వద్దని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు
తుపాను వాయవ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వర్షాలు తగ్గి, ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయి.
మొంథా తుపానుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు డ్యాంలు, నదులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, కాలువలు నిండుకుండుల్లా మారాయి. వర్షాలకు వెయ్యి హెక్టర్లలో వరి, వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు నీటమునిగాయి. సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
Read More
Next Story