డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి ఏ మంత్రి వర్గ సమావేశానికి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టలేదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఇంత వరకు ఏ మంత్రి వర్గ సమావేశం ఎగ్గొట్ట లేదు. క్రమం తప్పకుండా ప్రతి కేబినెట్‌కు హాజరయ్యారు. రాజకీయాలకు అలవాడు పడినా.. పాలన రంగానికి కొత్త కావడంతో ఏదో నేర్చుకోవాలనే తపనతో ప్రతీ సమావేశానికి హాజరవుతూ వచ్చారు. తన శాఖలలో అధికారులతో జరిగే అంతర్గత సమీక్ష సమావేశాలను కూడా ఓపికతో పాల్గొంటూ, తన శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించేవారు. నాడు చదువు లేక పోవడం, ఇంటర్‌తోనే తన చదువును ఆపేయడం, దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఇప్పుడు తెలుస్తున్నాయని, చవుదువు ప్రాముఖ్యత, బాగా చదవుకొని ఉండి ఉంటే సులువుగా సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి వీలుండేదని మంత్రి పదవి చేపట్టిన తొలి నాళ్లల్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అప్పట్లో ఇవి సంచలనంగా మారాయి. తన చదువు గురించి చెప్పి తన నిజాయితీని చాటుకున్నారని టాక్ వచ్చింది.