దేవుని ఆస్తి దోచుకోవడం దేశ ద్రోహం కంటే ఎక్కువ నేరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


వక్ఫ్‌ సవరణ బిల్లు మీద ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పార్లమెంట్‌ ఉభయ సభలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం భారత దేశంలో ఒక శుభపరిణామమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లుపై లోక్‌ సభలో 12 గంటలు, రాజ్యసభలో 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి, ఈ వక్ఫ్‌ బిల్లు మీద ఏకపక్ష నిర్ణయంగా కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆందోళనను పరిష్కరించే విధంగా ప్రభుత్వ పక్షం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

అంత ప్రాముఖ్యమైన వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదం తెలపడం అనేది కేవలం పార్లమెంటరీ విజయం కంటే న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేసిన ఒక చారిత్ర అడుగుని పవన్‌ కల్యాణ్‌ అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని, ఎన్డీఏ పాలనలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నిబద్దతను మరో సారి నిరూపించుకున్నారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వక్ఫ్‌ ఆస్తులు, వక్ఫ్‌ బోర్డుల కార్యకలాపాల గురించి భారత దేశంలో ఎప్పటి నుంచో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, వక్ఫ్‌ బోరు సవాళ్లను పరిష్కరించడం కానీ, వక్ఫ్‌ బోర్డు కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడం కానీ, వక్ఫ్‌ ప్రయోజనాలు పేద ముస్లిం ప్రజలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు వక్ఫ్‌ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం అనే కీలక అంశాలలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమైన అడుగు ముందుకేసిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఇలా పని చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం, మార్గదనిర్దేశం చేయడంలోను నాయకత్వం వహించిన పార్లమెంట్‌ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల సంక్షేమ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో ఎన్డీఏ నాయకుడు జేపీ నడ్డాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వక్ఫ్‌ బిలుతో సంస్కరణకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఎంపీకి, వారి మద్దతుకు, ముస్లి సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ మేరకు శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశంలో 8.72 లక్షల వక్ఫ్‌ ఆస్తులు ఉన్నాయని, 2006లో 4.9లక్షల ఆస్తుల ద్వారా రూ. 12వేల కోట్ల ఆదాయం వస్తుందని సచార్‌ కమిటీ అంచనా వేసిందని, అంటే ప్రస్తుతం ఆయా ఆస్తుల విలువ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఉహించుకోవచ్చని పేర్కొన్నారు.

Next Story