అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పెళ్ళిళ్ళ ప్రస్తావన తేవడంతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నవ్వు ఆపుకోలేక పోయారు.


ఎన్నికల సమయంలో ప్రచారంలోనే కాదు అసెంబ్లీలో కూడా పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చింది. అయితే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావన తెచ్చి పవన్‌ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టడంతో పాటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళపై విమర్శలు గుప్పించారు. అయితే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చర్చలో భాగంగా స్వయంగా అసెంబ్లీలో అదే విషయాన్ని ప్రస్తావించి పవన్‌ కళ్యాణ్‌తో పాటు సభలోని మంత్రులు, సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశారు.

మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదుల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం శాంతి భద్రతలను మంటగలిపిందని, టీడీపీతో పాటు అన్ని పార్టీల నేతలపైన కేసులు పెట్టడం, నిర్బంధాలను గురి చేసిందని చెబుతూ సినిమాల్లో గొప్ప హీరోగా పేరు తెచ్చుకొని, రాజకీయాల్లో వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వంటి నేతను కూడా పలుమార్లు ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. సినిమాల్లో రౌడీలు, విలన్‌లను చితకొట్టే పవన్‌ కళ్యాణ్‌కు కూడా జగన్‌ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్ప లేదని అన్నారు. అలా ఏ విధంగా జగన్‌ ప్రభుత్వం ఏ విధంగా శాంతి భద్రతలను కాలరాసింతో అని వివరిస్తూ పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ ప్రస్తావన తెచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ ఏది చేసిన చట్ట ప్రకారం చే
స్తారని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చట్ట ప్రకారంగా మ్యారేజెస్‌ చేసుకున్నారు. అందులో తప్పు లేదు. ఆయన ఏది చేసిన చట్ట ప్రకారంగానే చేస్తారు. అని చెబుతూ నాటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళపై నోటికొచ్చినట్లు మాట్లారని, దీనిపైన తాను స్పందించానని, ఎన్ని సార్లు కలవరిస్తున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకొని పవన్‌ కళ్యాణ్‌తో కాపురం చేయమని నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలపై స్పందించానని చంద్రబాబు నాయుడు చెప్పడంతో సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైనా, తర్వాత నవ్వు ఆపుకోలేక పోయారు. ఆయనతో పాటు సభలోని సభ్యులు కూడా నవ్వులు చిందించారు. ఆ సంఘటన చెబుతున్న సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నవ్వు ఆపుకోలేక పోయారు.
Next Story