
అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారునికి గాయాలు!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. సింగపూర్ లో చదువుతున్న మార్క్ శంకర్ ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. సింగపూర్ లో చదువుతున్న మార్క్ శంకర్ ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. అక్కడి స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో శంకర్‌కు గాయాలయ్యాయి. స్కూల్లో మంటలు చెలరేగడంతో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడికి గాయాలు కావడం పట్ల తండ్రి పవన్ కల్యాణ్ ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఏప్రిల్ 8న అంటే ఈవేళ సాయంత్రం సింగపూర్ వెళతారని సమాచారం. ప్రత్యేక విమానంలో ఆయన సింగపూర్ వెళతారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా వెళతారని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చినమాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.
అక్టోబర్ 10, 2017న జన్మించిన మార్క్ శంకర్ ప్రస్తుత వయసు ఎనిమిదేళ్లు. సింగపూర్‌లో ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్నాడు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Next Story