పింక్ టాయిలెట్లు.. మహిళలకు మాత్రమే
అందులో ఆధునిక సదుపాయాలు. బాలింతలు, వయసు పైబడిన స్త్రీలు, బాలికలు, అన్నీ వయసుల వారు ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు.
జి. విజయ కుమార్
మహిళల కోసం చాలా చోట్ల ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అవన్నీ సాధారణ మైనవే. పైగా అవన్నీ పురుషుల టాయిలెట్లకు పక్కనే ఉంటాయి. కానీ విజయవాడలో ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లు అందుకు భిన్నం. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లకు ప్రత్యేక ఉంది. అత్యాధునిక సదుపాయాలతో దీనిని అందుబాటులోకి తెచ్చారు.
అన్ని రకాల వసతులు
మామూలు మరుగు దొడ్లతో పాటు గర్భవతులు, వయసు పైబడిన మహిళలు, కాళ్లు నొప్పులు ఉండి కూర్చో లేని వారని దృష్టిలో ఉంచుకొని వెస్టర్న్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. బాలింతలు, పిల్లల తల్లులు చిన్నారులకు బహిరంగ ప్రదేశాలలో పాలిచ్చేందుకు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెడుతూ హ్యాపీగా చిన్నారులకు పాలిచ్చేందుకు సపరేట్ వసతి అందుబాటులోకి తెచ్చారు. వీరి కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. మహిళలు, యుక్త వయసులో ఉన్న బాలికలు పిరియడ్స్ సమయాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటారు. పనులు, ప్రయాణ సమయాల్లో పిరియడ్స్ వస్తుంటాయి. అలాంటి సమయాల్లో కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెడుతూ పింక్ టాయిలెట్స్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించారు. శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం రూ. 5లకే శానిటరీ ప్యాడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది వరకు వాడిన ప్యాడ్స్‌ను బయట పడేసేందుకు ఎవరైనా చూస్తారేమోనని మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. దీని కోసం సింపుల్ సొల్యషన్ తీసుకొచ్చారు. పాత ప్యాడ్స్ కోసం వెండింగ్ మిషిన్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణ సమస్య తలెత్తకుండా వీటిని బర్న్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రయాణ సమయాల్లో ఒక్కో సారి బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో సమీపంలోని పింక్ టాయిలెట్ ప్రాంగణంలో కూర్చునే సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణ సమయాల్లో ఫ్రెష్ అయ్యేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు.
టార్గెట్ గ్రూప్
మహిళలు, యువతులు, బాలికలు, ఉద్యోగం చేసుకునే స్త్రీలు, ప్రయాణాలు సాగించే వారు ఇలా ప్రతి ఒక్క మహిళకీ టాయిలెట్ సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు.
20 లక్షలతో నిర్మాణం
విజయవాడ నగరంలో ఇలాంటివి మరిన్ని అందుబాటులో తెచ్చేందుకు విఎంసి అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. మహిళలకు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై ప్రత్యేకంగా సర్వే కూడా నిర్వహించారు. బస్సులు ఆగే చోట, ప్రయాణికులు వెయిట్ చేసే బస్ స్టాప్‌ల సమీపంలో రోడ్డు పక్కన వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ఒక టాయిలñ ట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో బెంజ్ సర్కిల్‌లో దీనిని నిర్మించారు. మరిన్ని టాయిలెట్స్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోంది. త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.
Next Story