ఎన్నికల సమయంలో పిన్నెల్లి హడావుడి ఎక్కువుగా ఉండింది. ఆయన చుట్టే మీడియా తిరిగింది. రాజకీయాలు కూడా ఆయన చుట్టే తిరిగాయి.
ఎన్నికల సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాట్ టాపిక్ మారారు. ఈవీఎంను పగుగొట్టడం, అది వీడియోలో రికార్డు కావడం, ఆ వీడియో వైరల్ కావడం అప్పట్లో సంచలనంగా సృష్టించింది. ఎన్నికలకు సమయంలో మాచర్లలో చోటు చేసుకున్న అల్లరు హింసాత్మకంగా మారాయి. పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. దీంతో ఒక్క సారిగా అటెన్షన్ అంతా మాచర్ల మీదకు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకు మళ్లింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిన్నెల్లి పేరు మారుమోగి పోయింది. ఆ తర్వాత ఆయన మీడియాకు దూరమయ్యారు. బెయిల్ సమయంలో మీడియాలో ఒక సారి కనిపించిన పిన్నెల్లి తర్వాత కనిపించకుండా పోయారు.
చాలా రోజుల తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డితో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. నరసరావు పేటలో అన్నదాతకు అండగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల పక్షాన శుక్రవారం కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. వ్యవసాయాన్ని జగన్ పండుగలా చేస్తే.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకుంటే కూటమి ప్రభుత్వం వారి నడ్డి విరిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి వైఎస్‌ఆర్‌సీపీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.