ఐదేళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం. మద్యం మత్తులో అర్థరాత్రి అఘాయిత్యం.


తరచూ కామాంధులు చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. కొంత మంది ఇరుగు పొరుగున ఉన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు కుమార్తెలు, చెల్లెళ్ల వరసలను కూడా చూడకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇప్పడు అంతకుమించి ఓ కన్న తండ్రే లోకం అంటే ఏమిటో తెలియని ఐదేళ్ల కుమార్తె పట్ల కామాంధుడిలా మారాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మద్యం మత్తులో. కాటేశాడు. తాగిన మైకంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కసాయి.. తన బిడ్డపై మృగంలా ప్రవర్తించాడు. తండ్రి అన్న పదానికే కళంకం తెచ్చాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణం విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగింది. అసలేం జరిగిందంటే?

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన రాగతి అప్పన్న (30) దంపతులు ఫిషింగ్‌ హార్బర్‌లో పనుల కోసం కొన్నాళ్ల క్రితం విశాఖ వచ్చారు. మత్స్యకారులైన వీరు హార్బర్‌కు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. దీంతో అప్పన్న తన కుమారుడు అభిరాం (7), కుమార్తె (5)లతో కలిసి వేరుగా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అప్పన్న తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం మద్దం సేవించి తన ఇద్దరు పిల్లలను ఆటోలో ఎక్కించుకుని అర్థరాత్రి తగరపువలస చేరుకున్నాడు. తగరపువలసలోని పాత కృష్ణా కాలేజీ సమీపంలోని పోస్టాఫీసు వద్ద పిల్లలతో సహా ఆటో దిగాడు. అక్కడే ఉన్న ఓ బడ్డీ వద్దకు తన చిన్నారి కూతురుని తీసుకెళ్లాడు. కన్న తండ్రే కదా? అని నిర్భీతిగా వెళ్లిందా అమాయక కూతురు. బడ్డీలోకి తీసుకెళ్లిన తండ్రి అప్పన్న కూతురు అన్న çస్ప ృహ మరిచాడు. ఒక్కసారిగా రాక్షసుడిలా మారి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి కబంధ హస్తాల నుంచి విడిపించుకోలేని ఆ బిడ్డ.. నాన్నా, నాన్నా అంటూ పెద్దగా రోదించింది. ఆమె రోదన, కేకలకు అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సమీపంలోని స్థానికులు పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. చికట్లో ఆమె కనిపించకపోయినా, ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. దీంతో ఎట్టకేలకు బడ్డీ వద్దకు వెళ్లిన వారికి తండ్రి చేతిలో చెరబడుతున్న కూతురు కనిపించింది. దీంతో ఆ చిన్నారిని కసాయి తండ్రి నుంచి రక్షించారు. అప్పన్నకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. విశాఖ నార్త్‌ ఏసీపీ పెంటారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.


Next Story