పొట్టిలంకలో పుట్టెడు బంగారం..
x
Source: Twitter

పొట్టిలంకలో పుట్టెడు బంగారం..

ఎన్నికల వేళ రాజమెండ్రి పొట్టిలంక మండలంలో భారీగా వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని డీఎస్‌పీ అంబికా వెల్లడించారు.


ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రమంతా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ గస్తీ కాస్తూ ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు జరగకుండా నిరోధిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ కడియం మండలం పొట్టిలంక 216 నెంబర్ జాతీయ రహదారిపై ఓ బొలేరో వాహనం అనుమానాస్పదంగా కనిపించడం దానిని పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆ బొలేరో నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే వెండి, బంగారు వస్తువులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ వెల్లడించారు. ‘‘పలు శాఖల అధికారులు తనిఖీలు చేశారు. వాటిలో భాగంగా సదరు బొలేరో వాహనం నుంచి సుమారు రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాం’’అని చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం సదరు వస్తువలను జిల్లా గ్రీవెన్స్ కమిటీకి తరలించామని డీఎస్‌పీ వెల్లడించారు.

Read More
Next Story