ఏపీలో ఉదయం నుంచే ఊపందుకున్న పోలింగ్‌
x

ఏపీలో ఉదయం నుంచే ఊపందుకున్న పోలింగ్‌

ఉదయం నుంచే భారీగా పోలింగ్‌ శాతం పెరుగుతోంది. ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు 23 నమోదు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం నుంచే పోలింగ్‌ ఊపందుకుంది. ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తుండటంతో పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతోంది. మే 13న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొదలైన రెండు గంటల తర్వాత 9 గంటల సమయానికి 9.21 శాతం నమోదైంది. పిఠాపురంలో 10.02, పులివెందులలో 12.44 శాతం, కడప జిల్లాలో 12.09 శాతం, గుంటూరు జిల్లాలో 6.17 శాతం నమోదైంది. మరో రెండు గంటలకు పోలింగ్‌ శాతం బాగా పెరిగింది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 23 శాతానికి పెరిగింది. శ్రీసత్యసాయి జిల్లాలో 20.61శాతం, అన్నమయ్య జిల్లాలో 22.28, పల్నాడు జిల్లాలో 23.25, ఎన్టీఆర్‌ జిల్లాలో 21.39, గుంటూరు జిల్లాలో 20, 84 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. అన్నమయ్య జిల్లాలో 22.28, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 27.02, నంద్యాల జిల్లాలో 27.19. కర్నూలు జిల్లాలో 22.05, అనంతపురం జిల్లాలో 23.90 శాతం చోప్పున పోలింగ్‌ నమోదైంది. బాపట్ల జిల్లాలో కూడా భారీగానే పోలింగ్‌ నమోదైంది. బాపట్లలో 26.88, ప్రకాశం జిల్లాలో 23.89, నెల్లూరు జిల్లాలో 23.77, తిరుపతి జిల్లాలో 22.66 శాతం, చిత్తూరు జిల్లాలో 25.81, ఏలూరు జిల్లాలో 24.28, కృష్ణా జిల్లాలో 25.85 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. అనాకపల్లి జిల్లాలో 19.75, కాకినాడ జిల్లాలో 21.26, కోనసీమ జిల్లాలో 26.74, తూర్పు గోదావరి జిల్లాలో 21.75, పశ్చిమ గోదావరి జిల్లాలో 23.26, శ్రీకాకుళం జిల్లాలో 21.37, విజయనగరం జిల్లాలో 23.21, మన్యం జిల్లాలో 15.40, విశాఖపట్నం జిల్లాలో 20.47, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 18.61 శాతం చొప్పున పోలింగ్‌ శాతం నమోదైంది.

Read More
Next Story