రాజంపేట జైలుకు పోసాని
x

రాజంపేట జైలుకు పోసాని

సుమారు 5 గంటల వాదోపవాదాల అనంతరం నటుడు పోసాని కి 14 రోజుల రిమాండ్ విధించారు.

 &

సుదీర్ఘ గంటలపాటు సాగిన విచారణ తర్వాత నటుడు, వైసీపీ నాయకులు పోసాని మురళి కృష్ణకు రైల్వే కోడూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పిజి. తేజసాయి తీర్పు చెప్పారు. అన్నమయ్య జిల్లా పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేసి గురువారం ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో రైల్వే కోడూరు కోర్టుకు తీసుకుని వచ్చారు. వైసిపి నాయకుడు, నటుడు పోసాని మురళి కి వైసీపీ లీగల్ సెల్ పక్షాన సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసును వాదించారు. టిడిపి లీగల్ సెల్ నుంచి కూడా తిరుపతి చెందిన చిట్టిబాబు న్యాయవాదుల బృందంతో హాజరయ్యారు.

రాత్రి పదిన్నర తర్వాత ప్రారంభమైన కేసు విచారణ శుక్రవారం వేకువ జామున మూడు గంటల వరకు జరిగింది. పోసాని కృష్ణ మురళి పై పెట్టిన సెక్షన్లపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐపీసీ 111 సెక్షన్ పెట్టడం బైక్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. రైల్వే కోడూరు ఫస్ట్ క్లాస్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో తెల్లవారుజాము వరకు సాగిన వాదోపవాదాల అనంతరం జడ్జి తీర్పు వెలువరిచారు. సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణ నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Read More
Next Story