Actor Posani | రాజంపేట నుంచి నరసారావుపేటకు మారిన పోసాని సీన్
x

Actor Posani | రాజంపేట నుంచి నరసారావుపేటకు మారిన 'పోసాని' సీన్

నటుడు పోసాని కృష్ణమురళీని కేసులు వెంటాడుతున్నాయి. రాజంపేట సబ్ జైలు నుంచి ఆయనను నరసారావు పేటకు తరలించారు.


వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఎఫ్డీసీ (AP FDC) చైర్మన్ గా పనిచేసిన నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీని పోలీస్ కేసులు వెంటపడ్డాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయనను నరసారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గాన పోసానిని తరలిస్తున్నారు.


సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు పాటు వారి కుటుంబీకులను నటుడు పోసాని కృష్ణమురళీ పరుష పదజాలంతో దూషించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం జనసేన అన్నమయ్య జిల్లా కో కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. 196, 353 (2), 111 రెడ్‌విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో

హైదరాబాదులోని రాయదుర్గం లోని మై హోం భుజ అపార్ట్మెంట్ లో నటుడు పోసాని కృష్ణ మురళిని సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం సారధ్యంలోని పోలీసు బృందం గత బుధవారం రాత్రి అరెస్టు చేసి, గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు. దాదాపు ఎనిమిది గంటలపాటు పోసానిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సారధ్యంలో రైల్వే కోడూరు అర్బన సిఐ. పి వెంకటేశ్వర్లు, రైల్వే కోడూరు రూరల్ సీఐ హేమ సుందర్రావు, ఓబులార్ పల్లి ఎస్ఐ మహేష్ నాయుడు కలిసి పోసాని కృష్ణమురళీని విచారణ చేశారు. అనంతరం రైల్వే కోడూరు జడ్జి జ్జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పిజి. తేజసాయి ముందు హాజరు పరిచారు. రాత్రి పది గంటల నుంచి మరుసతి రోజు తెల్లవారుజూము వరకు పోసాని పక్షాన వైసీపీ లీగల్ సెల్ నుంచి హాజరైన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి, తిరుపతి లీగల్ సెల్ టీడీపీ ప్రతినిధి చిట్టిబాబు సారధ్యంలోని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇవన్నీ పూర్తయ్యాక నటుడు పోసానిని 14 రోజుల రిమాండ్ చెబుతూ కోడూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పిజి. తేజసాయి తీర్పు చెప్పారు. దీంతో నాలుగు రోజులుగా పోసాని కృష్ణమురళీ రాజంపేట సబ్ జైలులో ఉన్నారు.
పీటీ వారెంట్ పై మళ్లీ అరెస్ట్
సీఎం చంద్రబాబు తోపాటు ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరుష పదజాలంతో దూషించిన తీరుపై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళీపై కేసులో నమోదయ్యాయి. వరుస కేసుల్లో అరెస్టు చేయడం ద్వారా ఆయనను అనేక పోలీస్ స్టేషన్లకు తరలించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ పెద్దలను తేలనాడిన కేసుల్లో నిందితుడుగా ఉన్న పోసాని కృష్ణమురళీని నరసరావుపేట పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆ పోలీస్ స్టేషన్ లో పోసానిపై 153-ఎ, 504, 67 ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు వద్దకు పీటీ వారెంట్ తో చేరుకున్న నరసారావుపేట హైమారావు సారధ్యంలోని పోలీసులు పోసానిని కష్టడీకి తీసున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పోసానిని వాహనంలో తీసుకుని వెళ్లారు.


Read More
Next Story