పోతిన మహేష్‌కే విజయవాడ వెస్ట్‌

పోటీ పడిన నలుగురు టీడీపీ సీనియర్‌ నేతలు. జనసేనకు దాదాపు టిక్కెట్‌ ఖరారు. ఆసక్తి కరంగా మారిన అభ్యర్థి ఎంపిక.


పోతిన మహేష్‌కే విజయవాడ వెస్ట్‌
x
Potina mahesh jsp

జి. విజయ కుమార్

తెలుగుదేశం–జనసేన కూటమి విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా జనసేకు దాదాపు ఖరారు అయినట్టే. ఆ పార్టీ సీనియర్‌ నేత పోతిన వెంకట మహేష్‌కు కేటాయించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో జరిగిన భేటీలో ఆ మేరకు ఇరు పార్టీల పెద్దలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అధికార పక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ముస్లీ నాయకుడు షేక్‌ ఆసిఫ్‌కు ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇది వరకే ప్రకటించారు.
తెరపైకి నలుగురు పేర్లు
జనవరిలో ఆసిఫ్‌ పేరు ఖరారు కావడంతో ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. టీడీపీ–జనసేన కూటమి అభ్యర్థిని ఎప్పుడు ఖరారు చేస్తారని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూశారు. టీడీపీ నేతకే ఈ స్థానం కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాలు భావించాయి. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న ఈ స్థానం తనకు కేటాయించాలని చంద్రబాబు, నారా లోకేష్‌లను బహిరంగా కోరారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు కానీ అనకాపల్లి పార్లమెంట్‌ సీటు కానీ కావాలని కోరారు. ఆ మేరకు ఆయన విజయవాడలో బల నిరూపణ కూడా ప్రదర్శించారు. అనుచరులతో ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేపట్టారు. అంతటితో ఆగకుండా ఆయన రక్తంతో సిబిఎన్‌ జిందాబాద్‌ అని వాల్‌ రైటింగ్‌తో రక్తాభిషేకం కూడా చేశారు. బుద్దా వెంకన్నతో పాటు మరో ముగ్గురు టీడీపీ ముస్లీం నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్, బేగ్, నాగూల్‌ మీరా పేర్లు వచ్చాయి. జలీల్‌ ఖాన్‌ గతంలో రెండు పర్యాయాలు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి 2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. తొలి సారి టీటీపీ అభ్యర్థి నాగూల్‌ మీరా గెలవగా రెండో దఫా వెల్లంపల్లి శ్రీనివాస్‌పైన విజయం సాధించారు. 2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. నాగూల్‌ మీరా కూడా టీడీపీ సీనియర్‌ నేత. 2014 టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. 1999లో నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి జలీల్‌ ఖాన్‌పై పోటీ చేసి ఓడి పోయారు. ఎస్‌కే బేగ్‌ కూడా విజయవాడ పశ్చి స్థానం ఆశించారు. ఆయన సిట్టింగ్‌ ఎంపి కేశినేని నాని అనుచరుడు. అయితే నానితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు.
నలుగురికి చెక్‌
పొత్తులో జనసేన నేత పోతిన మహేష్‌కు టికెట్‌ దాదాపు ఖరారయ్యే అవకావాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ నలుగురికి చెక్‌ పెట్టినట్లేనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. పోతిన మహేష్‌ గతంలో ఇదే నియోజక వర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నుంచి షాబానా ముసారత్‌ ఖాటూన్‌ పోటీ చేయగా జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్‌ బరీలో దిగారు. వెల్లంపల్లి గెలువగా మహేష్‌కు 22,367 ఓట్లు వచ్చాయి. అయినా ఆ నియోజక వర్గాన్ని అంటి పెట్టుకొనే ఉన్నారు. ఇప్పటికే నియోజక వర్గంలో ఆయన ప్రచారం సాగించారు. అందరినీ కలుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Next Story