నమ్మినందుకు పవన్ నట్టేట ముంచారంటున్న పోతిన మహేష్
x
Source: Facebook

నమ్మినందుకు పవన్ నట్టేట ముంచారంటున్న పోతిన మహేష్

జనసేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్‌కు పంపారు. ఇప్పుడు పోతిన ఏం చేస్తారు..


ఎన్నికల ముందర దాదాపు అన్ని పార్టీల్లో రాజీనామాల పర్వం జరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి జనసేన కూడా వచ్చి చేరింది. ఇన్నాళ్లూ పార్టీలో అసంతృప్తి ఉన్నా ఎవరూ రాజీనామా చేయలేదు. చిట్టచివరికి ఆ ముచ్చటక కూడా జనసేనకు తీరిపోయింది. విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జ్‌గా పోతిన మహేష్ రాజీనామా చేశారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పంపారు. కాగా తన రాజీనామాకు అసలు కారణం ఏంటన్న విషయాన్ని ఈ లేఖలో ఎక్కడా పేర్కొనలేదు. ఈ లేఖలో కేవలం రెండో రెండు వ్యాఖ్యాలు రాశారు. వాటిలో తాను బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు వివరిస్తున్నది ఒక వాక్యమైతే మరొకటి సహకరించిన పార్టీ నేతలకు ధన్యావాదాలు చెప్తున్నది. ప్రస్తుతం ఈ లెటల్ హల్ చేస్తోంది. రాజీనామాకు కారణాన్ని ఎందుకు ప్రస్తావించలేదన్న అనుమానాలకు తావిస్తోంది.

చెప్పాల్సిన అవసరం లేదా!

పొత్తు పేరుతో జనసేనలో పోతిన మహేష్‌కు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అనుచర వర్గం కొన్ని రోజులుగా వాపోతోంది. విజయవాడ పశ్చిమ సీటును తనకే ఇస్తారని భావిస్తే పొత్తు ధర్మం అంటూ దాన్ని బీజేపీకి ఎలా కట్టబెడతారని వారు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పోతిన మహేష్ ఎంతో కృషి చేశారని, ఈ అంశంపై పవన్‌తో మాట్లాడిన లాభం లేకపోవడంతో మహేష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం. దీంతో తన అనుచరులతో చర్చలు కొనాగించిన అనంతరం పార్టీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారని, తన అభిమతం గురించి పట్టించుకోని పార్టీకి రాజీనామాకు కారణం చెప్పాల్సిన అవసరం ఏముందని భావించే పోతిన మహేష్ తన రాజీనామా లేఖలో కారణం వివరించలేదని కొందరు వాదిస్తున్నారు.

టికెట్ దక్కలేదనా.. పవన్ పట్టించుకోలేదనా..!

బెజవాడ పశ్చిమ సీటు తనకే కావాలని పోతిన మహేష్ పట్ట పట్టారు. ఇదే అంశంపై పార్టీ అధిష్టానాన్ని కూడా నిలదీశారాయన. ఆఖరికి అనుచరులతో కలిసి నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ‘‘ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ కోసం పనిచేశా. నాతో పాటు నియోజకవర్గ ప్రజలు శ్రమించారు. నాకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా వాళ్లు వైసీపీతో పోటీ పడలేరు. ఇక్కడి నుంచి ఎన్నికల్లో నిలబడటానికి నేనే సరైన అభ్యర్థిని. నాకు పవన్‌పై నమ్మకం ఉంది’’ అని వెల్లడించారు. దానికి రెండు రోజుల తర్వాతే ఓ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్.. పొత్తు ధర్మాన్ని పాటించాలని.. దాన్ని విస్మరించినా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్వవని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేష్.. పార్టీ కోసం కృషి చేసిన తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే పార్టీ మారుతున్నారని కూడా చర్చలు జరుగుతున్నాయి. నిన్న రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ చెప్తానన్న పోతిన ఉదయానికి పార్టీకి రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

స్వంత్ర అభ్యర్థిగా పోతిన!

జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన తదుపరి అడుగులు ఎటు అన్న అంశం తెరపైకి వచ్చింది. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ సీటు నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని, తనకు సీటు ఇవ్వని చోట నుంచే బరిలోకి దిగి గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ ప్రస్తుతం అనేక సీట్లు ప్రకటించాల్సిన కాంగ్రెస్‌పై అడుగులు వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అనే వారు కూడా ఉన్నారు. మరి తన భవిష్యత్ కార్యాచారణపై పోతిన మహేష్ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.



Read More
Next Story