ఇది ఫేక్ న్యూస్. కావాలనే కొందరు అలా పెట్టారు. ఇది సిగ్గు చేటు అంటూ ప్రకాష్‌రాజ్ ఘాటుగా స్పందించారు.
ఎవరో తెలియదు కానీ కుంభమేళాకు, ప్రకాష్ రాజ్‌కు లింకెట్టారు. ఉత్తరప్రదేశ్ కుభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లు ఎవరో ఓ ఫోటోని తయారు చేసి దానిని సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పాటుగా పలురకాల చర్చలకు కూడా దారి తీసింది. కుంభమేళాకు, ప్రకాష్ రాజ్‌కు లింకెట్టి చర్చలు సాగిస్తున్నారు. కొంత మంది ఈ ఫొటో డూప్లికేటని కొట్టి పడేస్తుంటే.. మరి కొందరు రకరకాలుగా కామెంట్లు పెట్టేస్తున్నారు. ప్రకాష్ రాజ్ దేవుళ్లను నమ్మని నాస్తికుడు కదా.. మరి కుంభమేళాకు వెళ్లడమేంటి.. అక్కడ పుణ్య స్నానం ఆచరించడమేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు.
నాస్తికుడనే చెప్పుకునే మీరు కుంభమేళకు వెళ్లారంటే ఏమనాలి? అని ప్రశ్నలతో కూడిన కామెంట్లు సంధిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ అసలు ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు వెళ్లారా? వెళ్ల లేదా? ఈ ఫొటో అసలుదా? నకిలీదా? అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ఎందుకంటే కుంభమేళాలో పుణ్యం స్నానం ఆచరిస్తున్నట్లు ప్రకాష్‌రాజ్ ఫొటోను క్రియేట్ చేయడంతో ఇది ఒరిజినలా? డూప్లికేటా? అని గుర్తు పట్టలేనంతగా క్రియేట్ చేశారు. దీంతో నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపైన ప్రకాష్ రాజ్ చెబితే అసలు విషయం తెలుస్తుంది. మరో వైపు సామాజిక మాధ్యమాలకు దారి తీసిన ఈ కుంభమేళా రచ్చ కాస్త ప్రకాష్ రాజ్‌కు చేరింది. సింగిల్ మాటతో దీనిని ప్రకాష్ రాజ్ కొట్టిపడేశారు. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చారు. కావాలనే తన ఫొటోను ఇలా క్రియేట్ చేసి కావాలనే సోషల్ మీడియాలో పెట్టారని మండిపడ్డారు. పవిత్రమైన కుంభమేళా సందర్భంలో ఇలా చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశానని, తదుపరి సీరియస్ పరిణామాలు ఎదుర్కొంటారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. దీంతో కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని తేలి పోయింది. కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారనే విషయం కూడా ప్రకాష్ తేల్చేశారు.