మనుధర్మం, భారతీయ లౌకికత
x
Bronze sculpture depicting Mahad water moment by B R Ambedkar

మనుధర్మం, భారతీయ లౌకికత

నేడు మనుధర్మాన్ని బ్రాహ్మణేతర వర్గాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఈ విషయాన్ని స్వాతంత్య్రో ద్యమం కానీ, వామపక్ష, ప్రజాస్వామ్య లౌకిక సమాజం తీవ్రంగా పరిగణించలేదు.


- ప్రొఫెసర్ కె.ఎస్.చలం


(అనువాదం : రాఘవశర్మ)


భారతీయుల జీవితాలను మనుధర్మం అనే పురాతన హిందూ స్మృతి వెంటాడుతోంది. ఈ స్మృతిని అమలు చేయడానికి హిందూ పాలక వర్గాలు సిద్ధం చేసిన బహిరంగ, రహస్య ఎజెండా ప్రధాన చర్చల స్రవంతిలోకి వచ్చిపడింది. గతంలో ఎప్పుడూ బహిరంగంగా చర్చించ లేదు. ఇప్పుడిది ఒక ముఖ్యమైన చర్చనీయాంశమైంది. అయితే, చైనీయుల చొరబాట్లు, ప్రపంచ కుబేరుల జాబితాలోకి అంబానీ చేరడం వంటి వాటిపైన మేధావులు జరిపే చర్చోపచర్చల ముందు ఇది తేలిపోతున్నది.

"కులం అనేది గతానికి సంబంధించింది కాదు. ఆమధ్య 'థామ్సన్ రాయటర్ ఫౌండేషన్ ప్రెస్ 2020' నివేదిక ఒక అధ్యయనం జరిపించింది. ఈ నివేదికను వార్తల గది నుంచి బహుజన కథనాలు" (Caste is not a thing of the Past: Bahujan stories from the newsroom floor)అంటూ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అచ్చేసింది . ఈ నివేదిక ప్రకారం ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషలకు చెందిన 80 శాతం మంది జర్నలిస్టులు ఒకే కులానికి చెందిన వారు.

మౌనంగా ఉండడం ద్వారా, ప్రత్యర్థులు నష్టపోవడం గురించి నిమ్మళంగా మాట్లాడడం ద్వారా, ఈ జర్నలిస్టులు తమ సొంత అభిప్రాయాలతో వార్తల గదిలో మునిగి ఉండడం సహజం.
వారీ చర్చను పాపంగా భావిస్తారు కనుక, అది ప్రధాన వార్తా స్రవంతిలోకి రాదు. అవును వారు కాలం చెల్లిన బ్రహ్మ పుత్రుడైన మనువు ప్రవచించిన పవిత్రమైన సూత్రాలను అనుసరించేవారు.

మత్స్యపురాణం ప్రకారం బ్రహ్మ షత్రుప (సరస్వతి)లను మనువే సృష్టించాడు. మధ్యధరా ప్రాంతంలోని అబ్రహాం విశ్వాసాల ప్రకారం ఆదం లాగానే, వేదాలు, పురాణాల ప్రకారం మనువు తొలి వ్యక్తి. మనుధర్మం మొదటి భాగం బైబిల్ లో చెప్పినట్టు, మధ్యధరాలో మహత్తరమైన నోహ్ వరద వచ్చి ఏడుగురితో కలిసి, ఆర్యావర్తంలో మనువు అనే రుషి ప్రపంచాన్ని రక్షించాడు.

ఇది ఏం సూచిస్తోందంటే, ఆర్య బ్రాహ్మణులు భారతదేశంలో అడుగుపెట్టి, ప్రజలను జయించడానికి వారిని వర్ణాలుగా విభజించి, వారిలో పుట్టుకతో బ్రాహ్మణులు అధికులని చెప్పారు.
సింధు భూమిలో గ్రహాంతర వాసులు కాలు మోపినప్పటి నుంచి ఈ దేశానికి మనుధర్మమే మార్గాంతరమైంది.

వారి సుదూరపు సోదరులైన బ్రిటిష్ వారు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, అనేక మన్వంతరాల తరువాత వైవస మన్వంతరంలో(?), ఆ జీవన స్మృతిని పునరుద్ధరించడం తమ పవిత్ర కర్తవ్యంగా భావించారు.
కలకత్తాలోని సుప్రీం కోర్టు న్యాయమూర్తి, పురాతన భాషా శాస్త్రవేత్త విలియమ్ జోన్స్ 1794లో మనుధర్మాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. దానికంటే ముందు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ 1873లో భారత దేశంలో హిందువులను వారి అలోచన ప్రకారం, వారి ధోరణి ప్రకారం పరిపాలించడానికి పురాతన చట్టాల ననుసరించి పరిపాలనా విధానాలను రూపొందించాడు.

విదేశీపాలనను భారత దేశంపైన రుద్దడానికి వారన్ హేస్టింగ్ ఈ విధానాన్ని అనుసరించాడు. ప్రజలను తమ సొంత చట్టాల ద్వారానే వారి రక్షణను తిరస్కరించడం అనేది ఒక ఇబ్బందిగా తయారైంది. ప్రజలు వినయంగా ఉండడానికి ఇదొక రకమైన నియంతృత్వం. వారన్ హేస్టింగ్ భగవద్గీతను విల్కిన్స్ చేత ఇంగ్లీషులోకి అనువాదం చేయించాడు.

కాబట్టి “పశ్చిమ అహంకారానికి ప్రత్యామ్నాయంగా తూర్పు సేవ చేసింది. ఒకరిని మరొకరు అదుపు చేయడంగా కాకుండా ఒకరికొకరు బహుమానంగా సూచించనట్టు" అని రేమండ్ ష్వాబ్ వాదిస్తాడు. ఇంగ్లీషు వారి కుట్రకు వ్యతిరేకంగా హిందుత్వ విమర్శకు పూర్తిగా విరుద్ధమైంది. మనుధర్మంతో ప్రారంభమైన అతి పురాతనమైన తమ రక్త సంబంధీకుల (ఆర్యుల) హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలనుకున్నారు.

పజ్జెనిమిదవ శతాబ్దంలో సంపాదించినదని భావిస్తున్న ఒక రాత ప్రతి కలకత్తాకు చెందిన కులుక్ భట్ నుంచి విలియం జోన్స్ సంపాదించాడు. ఈ జర్మన్ పండితుడు ఈ రాత ప్రతిని క్రీస్తు పూర్వం 1250 నాటిదిగా భావించాడు. కానీ, దానిలోని లిపిని బట్టి ఇది అనంతర వేదకాలం నాటిదని నిర్ధారించారు. ప్రస్తుత నిర్ధారణ ప్రకారం ఇది క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 నాటిదిగా నిర్ధారణ జరిగింది.

భారతదేశంలోని హిందు రాజులకు మాత్రమే కాకుండా, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా వంటి బౌద్ధ మతావలంబుకులైన తూర్పు ఆసియా దేశాలకు కూడా ఇది మార్గదర్శకమైందని ప్రసిద్ధ పండితులు తేల్చారు. ఈ స్మృతి చాలా అత్యున్నతమైందని, ఇది యావత్ ప్రపంచానికి వర్తిస్తుందని, మానవ చరిత్రలో ఇదే తొలి స్మృతి అని హిందుత్వవాదులు ప్రచారం చేశారు.

జవహర్ లాల్ యూనివర్సిటీలో మనుస్మృతి పై ఆందోళన జరిగినప్పుడు, మహిళలకు, శూద్రకులాల వారికి, ఇతర అణగారిన జాతులకు వ్యతిరేకంగా మనుస్మసృతిలో ఉన్న అంశాలను తొలగించి దాన్ని సంస్కరించాలని సంస్కార్ భారత్ కు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు భావించారు. కాలం చెల్లిన ఈ స్మృతిపై ఆధునిక కాలంలో దృష్టి సారించడానికి వలసపాలకులు కృషి చేశారు.

తొలి నుంచి ఉన్న పాలకవంశాలకు ఇది మార్గదర్శకమైంది. గ్రీకులు, కుషానులు, మొఘలులు కానీ, నేటి ఆధునిక పాలకులు కానీ, ఒక వర్గానికి చెందిన వారి సలహాదారులు కానీ తమ మాతృభూమి భారతదేశానికి చెందిన ఉమ్మడి స్మృతి ఆధారంగా ఇక్కడి ప్రజలను పాలించడం మేలని భావించారు.

వారసత్వంగా ప్రచారంలో ఉన్న స్మృతిని హిందువులలో ఒక వర్గం చారిత్రకంగా లభిస్తున్న లిఖిత స్మృతిని లెక్కచేయ లేదు. బాబిలోన్ కు చెందిన హమురబ్బి కోడ్ క్రీస్తు పూర్వం 1792 నాటిది. అది మనుస్మృతి కంటే 1500 సంవత్సరాలకు మించిన పురాతనమైనదేమీ కాదు.

హమురబ్బి వంటి పురాతనమైన స్మృతుల నుంచి స్వీకరించి రాసినదే మనుస్మృతి,. పచ్చికమైదానాలలో నివసించిన కాకసియన్ తెగకు చెందిన గిరిజన జాతి ఇప్పుడు లేదు. వీరిలో కొందరు గ్రీసు, కొందరు ఇరాన్ కు, క్రీస్తు పూర్వం 1500-1600 మధ్య సింధుకు వలసవెళ్ళారు.
అలా వెళుతూ వీరు ఆ స్మృతిని కూడా తీసుకెళ్ళారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారితో సహా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి స్థానిక గిరిజన తెగలతో జన్యుపరమైన సంబంధం లేదని హార్వర్డ్ వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లోని మానవ జన్యుశాస్త్ర అధ్యయనంలో తేల్చారు. ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్, పాకిస్థాన్, తజకిస్తాన్లలో నివసించే ఆధునిక తాలిబన్లు సింధ్ బాద్ ను దాటి వచ్చారని ఈ అధ్యయనం నిర్ధారించింది.

తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపైన హింసను, సామరస్యతను ఉపయోగించారనడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు మనుధర్మంలోని విషయాలు బ్రాహ్మణేతర వర్గాలకు ఎందుకు వివాదాస్పదమైనాయి? ఇంత ముఖ్యమైన విషయాన్ని స్వాతంత్రోద్యమంలో కానీ, నేటి వామపక్ష, ప్రజాస్వామ్య లౌకిక సమాజంలో కానీ ఎవరూ తీవ్రంగా పరిగణించలేదు.

న్యాయశాస్త్ర విద్యార్థిగా ఒక్క అంబేద్కర్ మాత్రమే 1927లో మహాద్ లో మనుస్మృతిని దగ్ధం చేశాడు. దీన్నొక చెప్పుకోదగ్గ ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తించలేదు. హిందూ భారత దేశ చరిత్రలో దీన్నొక మైలు రాయిగా కూడా పరిగణించలేదు.

ఈ స్మృతి వల్ల సమస్య ఏంటి? మనుస్మృతి ఇంగ్లీషులోను, ఇతర భాషలలోను లభిస్తోంది. రెండువందల పేజీలున్న ఈ పుస్తకంలో 12 అధ్యాయాలు, 2690 స్మృతికి చెందిన పద్యపాదాలున్నాయి. వీటి మొత్తంలో 1034, అంటే 39 శాతం బ్రాహ్మణులకు సంబంధించిన శిక్షాస్మృతులుండగా, 971 క్షత్రియులకు సంబంధించినవి, మిగతావి వైశ్యులకు, శూద్రులకు, మహిళలకు సంబంధించినవి.

మొదటి అధ్యాయం మాత్రం బైబిల్లోని పుట్టుకను పోలి ఉంది. “అతను, ఆ భగవంతుడు, దేవుళ్ళ వర్గాలను కూడా సృష్టించాడు. వారు మంచి తెలివితేటలు గల వారు, స్వాభావిక చర్యలతో కూడి ఉంటారు. పవిత్రమైన కార్యక్రమాల కోసంనిప్పు నుంచి, గాలి నుంచి, సూర్యుడి నుంచి మూడంచెల వేదాలు ఎదిగాయి. కాలానికి చెందిన విభజన, చంద్రుడి నివాసం, గ్రహాలు, నదులు, మహాసముద్రాలు, పర్వాతాలు, మైదానాలు, ఎగుడుదిగుడు నేల, ప్రపపంచ సర్వతోముఖాభివృద్ధికి బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అతని నోటి నుంచి, అతని భుజాల నుంచి, అతని తొడల నుంచి, అతని పాదాల నుంచి పుట్టారు. "
ఈ వర్ణన పురుష సూక్తం నుంచి వచ్చింది. దీన్ని ఎవరూ సమర్థించడం లేదు. అది అలాగే కొనసాగుతోంది.
అన్నిటికంటే వివాదాస్పదమైంది మొదటి అధ్యాయం. దానిలోని "బ్రాహ్మణుడి పుట్టుక పవిత్రమైన చట్టాల అవతార రూపం. పవిత్రమైన చట్టం కోసమే అతను పుట్టాడు కనుక అతను బ్రాహ్మణుడయ్యాడు. చట్టాలను కాపాడడం కోసం ఈ భూమి పైన అత్యున్నత మైన వ్యక్తిగా బ్రాహ్మణుడు పుట్టడం ద్వారా అతను ఉనికిలోకి వచ్చాడు.”

"ఈ ప్రపంచంలో ఉనికిలోకి వచ్చిన ప్రతిదీ స్వాభావికమైన తన తెలివి తేటలు కల బ్రాహ్మణుల అస్తి. బ్రాహ్మణుడు సర్వాధికారి. గౌరవనీయులైన ద్విజుల్లో మూడు వర్గాలున్నాయి. బ్రాహ్మణుడు నూలుతో తయారు చేసిన జంద్యాన్ని వేసుకుంటాడు. క్షత్రియులు జనపనార జంధ్యాలు, వైశ్యులు ఉన్నితో చేసిన జంధ్యాలు వేసుకోవాలి.

"పవిత్రమైన చట్టాల ప్రకారం బ్రాహ్మణుడు మారేడు ఆకును కానీ, పలాస పత్రాన్ని కానీ ధరించాలి. బ్రాహ్మణులు సాధించిన వాటి గురించి కాకుండా, పుట్టుకను బట్టి వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు.

బాబిలోనియా, హిట్టిటి, వంటి ఇతర ఆర్య జాతులకు చెందిన గిరిజన జాతుల లాగానే ఇక్కడ కూడా స్త్రీలకు అతి తక్కువ స్థానం కల్పించారు. సమాంతర వర్ణానికి చెందిన వారినే పెళ్ళిచేసుకోవాలి. రెండవ సారి పెళ్ళి చేసుకోవాలనుకునే వారు తమ కులానికి చెందిన వారినే చేసుకోవాలి.

శూద్ర కులాలను పెళ్ళి చేసుకోవాలనుకునే వారు తమ కుటుంబాల్ని, పిల్లల స్థాయిని తగ్గించేసుకున్నట్టు అవుతుంది.
మహిళల స్థాయిని అయిదవ అధ్యాయంలో ఈ విధంగా క్రోడీకరించారు.

"ఒక బాలిక, ఒక యువతి, వయసు మీరిన మహిళ గానీ తన ఇంట్లో కూడా స్వతంత్రంగా వ్యవహరించకూడదు. అడ పిల్ల అయినా సరే తండ్రి సంరక్షణలో ఉండాలి. యవ్వనంలో భర్తకు, భర్త మరణిస్తే వృద్ధాప్యంలో కుమారుడి సంరక్షణలో ఉండాలి. స్త్రీ ఎప్పటికీ స్వతంత్రంగా ఉండకూడదు. "

తన తండ్రి నుంచికానీ, భర్త నుంచికానీ, కుమారుడి నుంచి కానీ, వారందరి నుంచి కానీ స్త్రీ విడివడకూడదు. అలా చేస్తే చట్ట ఉల్లంఘనే. ఆమె ఎప్పుడూ ఆనందంగా, ఇంటి విషయాలు సరిదిద్దడంలో తెలివిగా ఉండడమే కాకుండా, ఇంట్లో పాత్రలను శు భ్రంగా ఉంచుకోవాలి, అర్థికంగా ఖర్చుపెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి.

పాలకవర్గాల రహస్య ఎజెండాగా హిందుత్వ తాత్వికతను అమలు చేయడానికి కొందరు మనుధర్మాన్ని లేదా ఈ స్మృతిని పరిపాలనలోని అన్నిటా ప్రవేశ పెడుతున్నారు.

రాజ్యాంగంలోని 15, 16 అధికారణాల ద్వారా ఉద్యోగాలు పొందడానికి ఎస్పీ, ఎస్టీలు, ఓబీసీలకు కులప్రాతిపదికన రిజర్వేషన్లు ద్వారా పొందే హక్కులు, ప్రామాణిక విద్యను కల్పించాలనే జాతీయ విధానాన్ని పరోక్షంగా తిరస్కరించడమే నని, బ్రాహ్మణులకు జనాభా ప్రాతిపదికన కాకుండా వారికి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో కేటాయించడం కూడా అలాంటిదేనని కొందరు వాదిస్తున్నారు.

ఒకే ఒక్క కులం వారు అధికారంలో అత్యంత ముఖ్యమైన స్థితి, గౌరవాన్ని, సంపదను ఎలా పొందారో, సమానావకాశాలను ఇతరులకు ఎలా తిరస్కరిస్తున్నారో బహుజన కార్యకర్తలు సోదాహరణంగా వివరిస్తున్నారు. మనుధర్మంలో బ్రాహ్మణులకు ప్రాధానిమివ్వడం వల్లనే ఇలా జరుగుతోంది.

నాలుగు, అయిదు అధ్యాయాల్లో పేర్కొన్నటువంటి వారి సంప్రదాయ కర్తవ్యాలను కూడా అశ్రద్ద చేశారు.
మనుధర్మానికి వ్యతిరేకమైన లౌకికత్వం అనే పదాన్ని ఐరోపా పండితులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. లౌకికత్వం అంటే మతంతో సంబంధంలేని రాజ్యం. "రాజ్యాన్ని మతం నుంచి వేరు చేయడమే అని లౌకికత్వానికి నిర్వచించారు.

బ్రిటన్ జాతీయ లౌకి క సమాజాన్ని ప్రారంభించిన చార్లెస్ బ్రాడ్ లా (Charles Braudlaugh) “మతాన్ని, రాజ్యాన్ని విడదీయడమే లౌకికత్వానికి పునాది" అని గుర్తించాడు. మనం పొందుతున్న స్వేచ్ఛకు ఆధారమైన లౌకికత్వాన్ని సమర్థించే సూత్రాలను సూచిస్తుంది.

1. వేరుచేయడం : మత సంస్థలను ప్రభుత్వ సంస్థలనుంచి వేరు చేయాలి. ప్రజలు మత కార్యక్రమాల్లో పాల్గొన వచ్చు కానీ అది ఆధిపత్యం చెలాయించకూడదు.

2. స్వేచ్ఛ : ఇతరులకు హాని కలిగించకుండా తమ తమ విశ్వాసాలను, నమ్మకాలను కొనసాగించవచ్చు. వ్యక్తుల అత్మసాక్షి మేరకు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు.

3. సమానత్వం : మన మత విశ్వాసాలు, అవి లేకపోయినా వాటి ఆధారంగా అనుకూలంగా, అనను కూలంగా మలుచుకోరాదు.

ఇది పశ్చిమ దేశాల లౌకికత సారాంశం. లౌకికత్వాన్ని అర్థం చేసుకోవడానికి దీర్ఘ కాలం సాగిన మత యుద్ధాలు, సంస్కరణలు, ప్రెంచి విప్లవం అందించిన భావనలు దోహదం చేశాయి.

“మతం ఒక పీడన అయినప్పటికీ, నిజమైన ఇబ్బందులను వ్యక్తీకరించడానికి, నిజమైన పీడనకు నిరసన తెలపడానికి అది ఉపయోగపడింది. మతం అనేది పీడితుల సృష్టికి గుర్తు. హృదయం లేని ప్రపంచానికి హృదయం లాంటిది, చైతన్యం లేని పరిస్థితిలో చైతన్యం లాంటిది. అది ప్రజలకు మత్తుమందులాంటిది. మతాన్ని రద్దు చేయడమంటే ప్రజల ఊహాజనిత ఆనందాన్ని రద్దు చేయడం, వారి నిజమైన సంతోషాన్ని కోరడం. కాబట్టి మతం పైన విమర్శ అంటే కన్నీటికి కారణమైన దాని మూలాన్ని విమర్శించడం. మతం డొల్లతనాన్ని విమర్శించడం.” అంటాడు మార్క్స్.

'హెగెల్స్ తాత్వికత చట్టానికి రాజ్యాంగ విమర్శ' లో అనేక మతాలలో చేపట్టిన సంస్కరణల్లో మార్క్స్, ఐరోపా అనేక అనుభవాలను చవిచూచారు. భారతదేవంలో ప్రాచీన కాలంలో కానీ, మధ్య యుగాలలో కానీ, ఆధునిక కాలంలో కానీ ఇలాంటి అనుభవాలను చవిచూడలేదు.

హిందూ సంస్కరణ వాదులు కానీ, పశ్చిమ దేశాల పండితులు కానీ సమాజంలోని అట్టడుగున ఉన్న ఆదివాసీల గురించి కానీ, దళితుల గురించి కానీ, వారు ఇతర విశ్వాసాలకు మారడం గురించి కానీ, వారి జీవితాలలో జరిగే విధ్వంసాల గురించి కానీ పట్టించుకోలేదు.

పశ్చిమ దేశాలకు భిన్నంగా అధికసంఖ్యాకులైన బహుజనుల రాజకీయ, సామాజిక ఆలోచనను నిర్లక్ష్యం చేశామని కొందరు పండితులు అత్మపరిశీలన చేసుకున్నారు. ఆధునికులు కాని సంప్రదాయ పండితులు కూడా ఈ లోపాల వల్ల ఇబ్బంది పడ్డారు.

బ్రాహ్మణేతరుల, బహుజనుల విశ్వాసాలు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. జనాభాలో 90 శాతం మంది ప్రజలు బ్రాహ్మణీయ స్రవంతిలోని తంతులో పాల్గొన లేదు సరికదా, దాన్ని ఆచరించలేదు. మనువు ఎలాంటి శిక్షలు వేశాడో మనకు తెలుసు. వాళ్ళ స్థాయిని బట్టి విధించే కొన్ని శిక్షలు అందరికీ ఒకేలా లేవు.

ఆధునిక మనువు కథానాయకుడు లౌకికత్వాన్ని కానీ, ఉమ్మడి విధానాన్ని కానీ అనుమతించరు. బ్రిటిష్ పాలనా కాలంలో నేరశిక్షస్మృతిని 1881లో రూపొందించారు. దాన్ని 1974లో తిరిగి రాసి కులాలతో సంబంధం లేకుండా లౌకిక భావనతో ఉమ్మడి శిక్షాస్మృతిని చేర్చారు.

మనుధర్మం ఇప్పటికీ అమలు జరుగుతోందని, విచారణ ఖైదీల్లో 55 శాతం మంది దళితులు, ముస్లింలేనని కొందరు వాదిస్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే సమాజంలో ప్రధాన స్రవంతి ఇంకా బ్రాహ్మణీయ హిందుత్వ అదుపులోనే ఉంది కనుక, భారతదేశాన్ని లౌకిక దేశంగా సంస్కరించాలి. దాడులు, హింస ద్వారా అధికసంఖ్యాకులను హిందువులుగా మార్చే కంటే, అయిదు శాతం ఉన్న బ్రాహ్మలను ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడం తేలిక అన్నది ఒక తెలివిగల వాదన.

ఉమ్మడి పౌరస్మృతిని కూడా కొందరు ఈ దృష్టితోనే చూస్తున్నారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని అధికసంఖ్యాకులు ఆచరించే మతం ప్రకారమే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని కొందరు కోరుతున్నారు. జనాభాలో 85 శాతం ఉన్న దళితులు, ఆదివాసీలు, సేవలందించే ఇతర కులాలవారు ఆచరించే మత విషయాల్లో పూజారి వంటి మధ్యవర్తి లేకుండా నేరుగా చెట్టుకింద ఉన్న దేవత విగ్రహం దగ్గరకు వెళ్ళి తమ మాతృభాషలోనే ఆ దేవతతో తమ కష్ట సుఖాలను విన్నవించుకుంటారు. ఇది ప్రజాస్వామికంగా, లౌకిక తత్వంతో ఉంది.

దీనికి పూర్తి భిన్నంగా, బ్రాహ్మణీయ హిందుత్వ మత పద్ధతిలో తక్కువ సంఖ్యలో ఉన్న పూజారుల ప్రాధాన్యతను అదే సామాజిక నేపథ్యం ఉన్న మేధావులు, నిర్వాహకులు వారిని ప్రదర్శిస్తుంటారు. నిజానికి పూజారి, పురోహితుడు అనే మధ్య వర్తిని ఉపయోగించడమనేది మధ్యదరా ప్రాంతంలోని అబ్రహామిక్ విశ్వాసాలనుంచి హిందూ మతావలంభికులు స్వీకరించారు.

దిగువ కులాలవారు స్వతంత్రంగా వ్యవహరించే ప్రజాస్వామిక, లౌకికపద్ధతిలో జీవన విధానాన్ని దేశంలోని మనమంతా అనుసరించాలి.


(* ప్రొఫెసర్ కె ఎస్ చలం. మాజీ వైఎస్ చాన్స్ లర్. పొలిటిక్ ఎకానమీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా పుస్తక రచయిత. ఇది ఆయన మార్చి 17న విశాఖలో మనుధర్మం, దళితులు, రాజ్యాంగం అంశం మీద చేసి ప్రసంగానికి తెలుగు అనువాదం)

Read More
Next Story