చచ్చేంత వరకు శిక్ష..

అవును నాచెట్టు కాయను నేను తినడంలో తప్పేంటి అన్నాడో వ్యఃక్తి, ఆచెట్టేంటి, కాయేంటి?


చచ్చేంత వరకు శిక్ష..
x
విజయవాడ కోర్టు కాంప్లెక్స్

జి. విజయ కుమార్

క‌న్న కూతురునే గ‌ర్భ‌వతిని చేశాడో దుర్మార్గుడు. అభం శుభం తెలియ‌ని మైన‌ర్ బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ‌టంతో గ‌ర్భం దాల్చింది. నేరం రుజువు కావ‌డంతో విజ‌య‌వాడ ఫోక్సో కోర్టు మ‌ర‌ణించే వ‌ర‌కు జైలు శిక్ష‌ను విధించింది. కేసు న‌మోదు చేసిన కేవ‌లం 8 నెల‌ల్లోనే విచార‌ణ చేప‌ట్టి నిందితుడికి శిక్ష ప‌డేలా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీల‌క పాత్ర పోషించారు.

విజ‌య‌వాడ న‌గ‌రం టూటౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నివ‌సిస్తున్న ఫిర్యాదుదారుకు ఇద్ద‌రు బాలిక‌లు, ఒక బాలుడు. భ‌ర్త స‌మీపంలోని ఓ షామియానా షాప్‌లో ప‌ని చేస్తున్నాడు. పెద్ద కుమార్తె (15ఏళ్లు). ద‌గ్గ‌ర‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. మిగిలిన ఇద్ద‌రు పిల్ల‌లు అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద కుమార్తె గ‌త రెండు రోజులుగా వాంతులు చేసుకుంటూ నీర‌సంగా ఉండ‌టంతో జూలై2, 2023న త‌ల్లి ఆ బాలిక‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. స‌ద‌రు బాలిక గ‌ర్భ‌వ‌తి అయిన‌ట్లు డాక్ట‌ర్ చెప్ప‌డంతో బాలిక‌ను ఇంటికి తీసుకొచ్చి అడుగ‌గా ఇంటిలో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో తండ్రి త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ ప‌లుమార్లు అత్యాచారం చేసిన‌ట్లు త‌ల్లికి చెప్పింది. అంతేకాకుండా ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తా అని తండ్రి బెదిరించిన‌ట్లు చెప్పింది. దీనిపైన కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భ‌ర్త‌ను నిల‌దీసింది. అవును నా చెట్టు కాయ‌ను నేను తిన‌డంలో త‌ప్పేమిటి అంటూ గొడ‌వ ప‌డి అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు.
ఈ విష‌యంపై కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించ‌న త‌ల్లి జూలై8, 2023న టూటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో పిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు ఫోక్సో యాక్ట్ ఐపిసి 376(3),376(2)(ఎన్‌) సెక్ష‌న్ల ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి విజ‌య‌వాడ ప‌శ్చిమ ఏసిపి డా హ‌న్మంత‌రావు, టూటౌన్ ఇన్‌స్పెక్ట‌ర ఏ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జూలై10, 2023న నిందితుడైన మైన‌ర్ బాలిక తండ్రిని అరెస్ట్ చేస చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసును తీవ్ర నేరంగా ప‌రిగ‌ణించిన పోలీసులు క‌న్విక్ష‌న్ బేస్ట్ ట్ర‌య‌ల్ మోన‌ట‌రింగ్ ప‌ద్ధ‌తిలో నిందితునికి శిక్ష ప‌డేలా ట్ర‌య‌ల్ చేప‌ట్టారు. విచార‌ణ అనంత‌రం నిందితుడిపై నేరం రుజువైంది. మార్చి 18, 2024న విజ‌య‌వాడ ఫోస్కో కోర్టు జ‌డ్జి డా ఎస్ ర‌జ‌ని నిందితుడైన మైన‌ర్ బాలిక తండ్రికి జీవిత కాలం(చ‌నిపోయేంత వ‌ర‌కు) జైలు శిక్ష, రూ. 40వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జ‌రిమానా మొత్తం బాలిక‌కు చెందే విధంగాను, బాధిత బాలిక‌కు రూ. 5ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం వ‌చ్చే విధంగా చూడాల‌ని డిస్ర్టిక్ట్ లీగ‌ల్ సెల్ స‌ర్వీసెస్ అధారిటీ అధికారుల‌ను ఆదేశించారు. ఈ కేసులో ప్రాసిక్యూష‌న్ త‌ర‌ఫున స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ గుజ్జుల నాగిరెడ్డి, అప్ప‌టి ఏసిపి డా కే హ‌న్మంత‌రావు, టూటౌన్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏ సుబ్ర‌హ్మ‌ణ్యం, సిఎంఎస్ ఇన్‌స్పెక్ట‌ర్‌, సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దాదాపు 14 మంది సాక్షుల‌ను విచారించారు.
Next Story