విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర మంత్రికి పురందేశ్వరి లేఖ
x

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర మంత్రికి పురందేశ్వరి లేఖ

విశాఖ ఉక్కు అంశంపై ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. కేంద్రమంత్రి కుమారస్వామితో నేడు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కును మళ్ళీ లాభాల బాట పట్టించాలన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ను కొంతకాలంగా పీడిస్తున్న సమ్యల్లో విశాఖ ఉక్కు కూడా ఒకటి. దీనిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. వారికి మరెందరో ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. తాజాగా భారీ మెజారిటీతో ఆంధ్రలో గెలవడమే కాకుండా కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కూడా టీడీపీ, జనసేన కీలకంగా మారాయి. దీంతో విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు డిమాండ్ చేయాలని కూడా చాలా మంది మేధావులు సలహాలు ఇచ్చారు. కానీ అవేమీ లేకుండానే ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ మద్దతుగా నిలిచింది. కానీ వారి సూచనలను, ఆంధ్రుల ఆశలను మర్చిపోలేదని తాజాగా కూటమి నిరూపించుకుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. కేంద్రం భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి లేఖ రాశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించాలని, అందుకు కేంద్రం సహకారం కావాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఈరోజు పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆమె కుమారస్వామితో సమావేశమయ్యారు. అనంతరం తన వినతి పత్రాన్ని స్వయంగా ఆయనకు అందించారు. విశాఖ ఉక్కుకు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా తాము కృషి చేస్తున్నామని, అందుకే ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రితో సమావేశమయ్యామని వారు వివరించారు. గతంలో ఇచ్చిన వినతలు ఆధారంగా కుమార స్వామి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కుమార స్వామి బీజేపీ నేతలకు వివరించారు.

అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అందువల్ల ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవ విస్తు నిర్ణయం ఉండాలన్న విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించామని, స్టీల్ ప్లాంట్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తు లాభాల బాటలోకి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని వివరించామని, దానిపైనే సుదీర్ఘ చర్చలు జరిపామని వారు వెల్లడించారు. ‘‘స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి’’ అని కోరారు. వారి వినతిని ఆలకించిన కేంద్రమంత్రి కుమార స్వామి.. అందుకు సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు మాసాల్లో మరోసారి ఇదేవిధంగా ఒక సమావేశం నిర్వహించుకుందామని హామీ ఇచ్చారు.

Read More
Next Story