Icon Star Bunny | సినిమా.. రాజకీయాలను షేక్ చేసిన బన్నీ
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. వైసీపీ దీనిని సొంతం చేసుకున్నట్లే కనిపిస్తోంది.
అల్లూవారి అబ్బాయి ఐకాన్ స్టార్ అరెస్టు. ఇది సినిమా ఇండస్ట్రీ నే కాదు. రాజకీయాలను కూడా షేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు ఒకరకంగా, ప్రతిపక్షాలు మరో విధంగా స్పందించాయి. ఈ ఎపిసోడ్లో వైసీపీ అల్లు అర్జున్ ను దరి చేర్చుకుందది.
పుష్ప-2 అల్లు అర్జున్ అరెస్టు వెనక ఏం జరిగింది. ఈ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల స్పందన చర్చకు తెర తీసింది. ఆంధ్ర, తెలంగాణలోని అధికార పార్టీలు, ప్రతిపక్షాలు మరోరకంగా స్పందించాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి నాయకులు స్పందించిన విధానం పక్కకు ఉంచితే, ఏపీలో నాయకుల స్పందన మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో తాను తీసిన చిత్రం చూడడానికి బన్నీ వెళ్లారు. అదే సమయంలో టికెట్ తీసుకున్న ప్రేక్షకులకు కూడా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ కు వెళ్లారు. ఐకాన్ స్టార్ (Icon Star)గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ చూడడానికి జనం దిగబడిన నేపథ్యంలో జరిగిన తొక్కేసినట్లు ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జరగడానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమని వ్యవహారంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం పక్కకు ఉంచితే,
ఏపీలో రాజకీయ వ్యవహారం మాత్రం విభిన్నంగా కనిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంపై అధికార టిడిపి కూటమి తీరు ఒక రకంగా ఉంది.
"నువ్వు మా కోసం వచ్చావు. మేము నీకోసం ఉంటాం" అని వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ పరిణామం చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే..
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోరరెడ్డి కోసం ఆయన నివాసానికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ ఘటన..
టీడీపీ కూటమిలో రాజకీయ మంటలు మండించింది. కూటమిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామి. ఈయన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కు బామ్మర్ది కావడమే.
వైసీపీతో రాజకీయంగా పోరాటం పోరాటం సాగిస్తుంటే, వాళ్లకు మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లడం ఏమిటనేది పవన్ కళ్యాణ్ కు మింగుడు పడకపోవడం ఓ కారణమైతే, మిత్రపక్షాలకు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ సందర్భంలో అల్లు అర్జున్ ఏమన్నారంటే
"శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నా స్నేహితుడు. శుభాకాంక్షలు చెప్పి వెళ్ళడానికి వచ్చా. ఇది నా వ్యక్తిగతం" అని కూడా ఆయన తన పర్యటనను సమర్థించుకున్నారు. నంద్యాలకు అల్లు అర్జున్ రావడం అంటే కూటమి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యం కదా అనే మాట కూడా వినిపించింది.
దీని వెనుక కొన్ని వివరాల్లోకి వెళితే...
మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ కు స్వయానా మేనమామ. అల్లు-మెగా ఫ్యామిలీ పాలునీళ్లలో కలిసి ఉండేవి. సినిమా పరిశ్రమలోనో.. కుటుంబ వ్యవహార నేపథ్యమో.. మొత్తానికి ఆ రెండు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందనేది బయటికి వినిపించే మాట.
ఇది కాస్త అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం రావడం అనేది మరింత దూరం పెంచినట్లే కనిపిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రచారానికి వచ్చారనే విషయంపై నమోదైన కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఉపశమనం లభించింది. అది వేరే విషయం.
ఎన్నికలవేళ నంద్యాల పరిణామాన్ని దృష్టిలో ఉంచుకున్న వైసిపి అల్లు అర్జున్ ను వైసిపి ఓన్ చేసుకున్నది. పుష్ప-2 విడుదల సందర్భంగా కూడా అల్లు అర్జున్ కటౌట్లు, హోర్టింగులు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు మద్దతుదారులు..
"మా కోసం నువ్వు వచ్చావు. నీకోసం మేము నిలబడతాం" అని రాసిన వాక్యాలతో మద్దతుగా నిలిచారు. ఈ హోర్డింగులు రాయలసీమలోని అనంతపురం జిల్లా గుత్తి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో మంటలు పుట్టించాయి. టిడిపి కూటమి మద్దతుదారులు వాటిని ధ్వంసం చేయడంతో రగడ చెలరేగింది.
ఈ సీన్ కట్ చేస్తే..
బన్నీకి వైసిపి అండ
హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన సంఘటన రెండు రోజుల తర్వాత పుష్ప హీరో అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించడానికి కూడా ప్రకటించారు.
దీనిపై మొదట జనసేన స్పందించింది.
"సినిమా తీయడానికి పారితోషకం వందల కోట్లు తీసుకుంటారు. పరిహారం ఇంతేనా?" అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
తాజాగా సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బన్నీ అరెస్టుపై ఓ డిబేట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ "దేశ సరిహద్దులో యుద్ధం చేశారా? సినిమా తీశారు. డబ్బు సంపాదించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తుంది" అని చెప్పడం గమనార్హం.
ఏపీ మాజీ సీఎం వైఎస్. జగన్ స్పందన మరోరకంలా ఉంది . అల్లు అర్జున్ అరెస్టు దారుణం అంటూ, న్యాయసహాయం కోసం కోర్టులో కేసు వాదించడానికి ఏకంగా తన పార్టీ రాజ్యసభ సభ్యుడైన నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు. దీంతో అల్లు అర్జున్ ను వైసిపి సొంతం చేసుకున్నట్లే కనిపిస్తోంది.
ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. సీఎం చంద్రబాబును ఆమె టార్గెట్ చేశారు. "గోదావరి పుష్కరాల సమయంలో 22 మంది చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు" అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసం చేసిన షూటింగ్ వల్లే జరిగిన తొక్కిస లాటలో అంత మంది చనిపోయారు. ఈ ఘటనలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలి అని కూడా ఆమె నిలదీశారు.
ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే అల్లు- మెగా స్టార్ కుటుంబాలలో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడడమే కాదు. మెగా కుటుంబానికి దూరమైన అల్లు అర్జున్ వైసీపీ దగ్గరికి తీసుకున్నట్లే కనిపిస్తోంది.
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న అల్లు అర్జున్ కేసులో వైసీపీ పట్టు సాధించాలని భావిస్తున్నదనే విషయం సుస్పష్టం. ఈ వ్యవహారంలో రాజకీయంగా ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.
Next Story