నేనూ ట్వీట్ చేస్తున్నా. అన్ని సామాజి మాధ్యమాల్లో పోస్టులు పెడుతా. మీరు అదే పని చేయండని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు జగన్ పిలుపు.
ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి పార్టీల నేతలు ఇచ్చిన హామీలను, వాటికి ఎంత బడ్జెట్ కావలసి ఉంటుంది, బడ్జెట్‌లో వారు పెట్టిన కేటాయింపులు వంటి వివరాలు, ఫొటోలను అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ పిలుపునిచ్చారు. ఈ వివరాలను, ఫొటోలను తాను కూడా ట్వీట్ చేస్తున్నానని, అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని, ఎంత మందిని అరెస్టు చేస్తారో చూద్దామని, అరెస్టు చేయాలి అంటే తొలుత తననే అరెస్టు చేయాల్సి ఉంటుందని జగన్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో ఇచ్చిన కేటాయింపులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, తమ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, చంద్రబాబు హయాంలో అభివృద్ధి, తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, ఇలా ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని జగన్ నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను విచ్చల విడిగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.