డిసెంబరు 22న పీవీ సింధు వివాహం జరగనుంది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో శనివారం నిశ్చితార్థం జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లను ప్రముఖ భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ వీపీ సింధు కలిశారు. తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం పీవీ సింధు తన తండ్రి రమణతో కలిసి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. పెళ్లి పత్రికను అందజేసి తన వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసి తన వివాహానికి రావాలని పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు.

డిసెంబరు 22న పీవీ సింధు వివాహం జరగనుంది. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థానలోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబరు 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. పీవీ సింధు పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌లను ఇది వరకే ఆహ్వానించారు. ఇదిలా ఉంటే డిసెంబరు 14న పీవీ సింధు, వెంకట దత్త సాయిల నిశ్చతార్థం హైదరాబాద్‌లో జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.


Next Story