ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోకి వర్షం నీరు
x
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వర్షం నీటిని బయటకు తోస్తున్న ఆసుపత్రి సిబ్బంది

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోకి వర్షం నీరు

మిగ్‌జామ్‌ ‌తుఫాన్‌ ‌ప్రభావంతో ఏపీలోని కోస్తాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాయలసీమలో ఓ మోస్తరుగా కురుస్తున్నాయి.


మిగ్‌జామ్‌ ‌తుఫాన్‌ ‌ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌, ‌గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన అధికారులు పునరావాస ఏర్పాట్లలో బిజీ అయ్యారు.సీఎం జగన్‌ ‌కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. రిలీఫ్‌ ‌క్యాంపుల్లో తుఫాను బాధితులకు ఏ సౌకర్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఏలూరులో..

ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరింది.మోటర్ల సాయంతో నీళ్లను బయటకు తోడుతున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ ‌ప్రసన్న వెంకటేష్‌ ‌స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.





Read More
Next Story