సోషల్ మీడియా కేసులో విచారణకు రామ్‌గోపాల్ వర్మ హాజరు కాలేదు. దీంతో అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. వర్మ ఆచూకీ కోసం ప్రకాశం జిల్లా నుంచి రెండు పోలీసుల బృందాలు గాలింపులు చేపట్టాయి. ప్రస్తుతం ఆయన మొబల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వర్మ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ అన్నీ హైదరాబాద్‌లోనే చూపిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శంషాబాద్, షాద్‌గన్‌లోని ఆర్జీవీ ఫామ్ హౌస్‌లపై పోలీసులు దృష్టి పెట్టారు. రామ్‌గోపాల్ వర్మను ఎలాగైన సోమవారం సాయంత్రంలోగా పట్టుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. కాగా వ్యూహం సినిమా ప్రమోషన్‌ల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బ్రాహ్మణిలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, ఆయన మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసు విచారణ హాజరు కాకపోవడంతో వర్మను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లు సమాచారం.