'పార్టీల మ్యానిఫెస్టోలలో సీమ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి'
నాలుగు రోజల్లో పూర్తి స్థాయి రాయలసీమ ప్రజా మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆయా పార్టీల అధ్యక్షులకు ఇచ్చి రావాలని నిర్ణయం.
రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో తరతరాలుగా నష్టపోతున్న, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అంశాలను తమ మ్యానిఫెస్టోలలో చేర్చి ప్రాధాన్యతను ఇవ్వాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం నంద్యాలలోని తాలూకా కార్యాలయం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో లాయర్ భూమా కృష్ణారెడ్డి అధ్యక్ష్యతన రాయలసీమ నిజదర్శన దీక్ష జరిగింది.
ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ...
శ్రీబాగ్ ఒప్పందం కాలం నుండి నేటి వరకు సీమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు, కృష్ణా నది జలాలలో ప్రముఖ ప్రాధాన్యత, విద్యాసంస్థలు, శాసనసభ స్థానాలలో సమాన నిష్పత్తి తదితర అంశాల అమలుకు రాజకీయ పార్టీలు కట్టుబడి వుండాలని డిమాండ్ చేశారు. పన్నెండు సంవత్సరాల సాగునీటి ఉద్యమ ప్రస్థానంలో సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన, కృష్ణా నది యాజమాన్య బోర్డులో వెనుకబడిన ప్రాంతాల అనుమతించిన ప్రాజెక్టుల గుర్తింపు తదితర అనేజ ఉద్యమాలకు సీమ ప్రజా సంఘాల పక్షాన పోరాటాలు చేసామని అరెస్టులతో సీమ ఉద్యమం వెనుకడుగు వేయబోదని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం KRMB కార్యలయాన్ని కర్నూలులో స్థాపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ వ్యాప్తంగా సీమ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనేక రాయలసీమ అంశాలను చర్చించి కీలకమైన రాయలసీమ అంశాలపై నాలుగు రోజల్లో పూర్తి స్థాయి రాయలసీమ ప్రజా మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆయా పార్టీల అధ్యక్షులకు ఇచ్చి రావాలని నిర్ణయించడమైనది.
ఫిబ్రవరి మొదటి వారంలో రాయలసీమ ప్రజా సంఘాల ఆద్వర్యంలో కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి కేంద్రాలలో రాయలసీమ దీక్షా కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. సీమ సమస్యలపై ఈ ఎన్నికల సమయంలో ప్రజలలోకి తీసుకెళ్ళాలని నిర్ణయించారు.
ఈ దీక్షా కార్యక్రమంలో బాలవుశేని కళాకారుల బృందం సీమ పాటలను గానం చేసి ఆకట్టుకున్నారు.
ఈ నిజదర్శన దీక్షా కార్యక్రమంలో OPDR రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, జలసాధన సమితి నాయకులు చైతన్య గంగిరెడ్డి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు మణెమ్మ, కడప రైతు సేవా సమితి నాయకులు రమణ, అనంతపురం జిల్లా రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక భాస్కర్ రెడ్డి, RTPP కార్మిక సంఘం నాయకులు సుబ్బారెడ్డి, కడప జిల్లా న్యాయవాద సంఘం నాయకులు నాగరాజు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా సాగునీటి సాధన సమితి కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆదోని అభివృద్ధి వేదిక అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి,
రైతు కూలీ సంఘం నాయకులు రాజశేఖర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆత్మకూరు రవీంద్రనాథ్, ప్రముఖ న్యాయవాది శంకరయ్య,మాజీ కౌన్సిలర్లు గౌస్, కృపాకర్, కొండారెడ్డి,
రైతు నాయకులు బాలీశ్వరరెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, ఆకుమల్ల రహీం, కె.సి.కెనాల్, తెలుగుగంగ, SRBC ఆయకట్టు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Next Story