తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు ఇటీవల రెడ్‌బుక్‌ ఓపెన్‌చేసి అందులో పలువురు అధికారుల పేర్లు నమోదు చేసుకోవడం సర్వత్రా చర్చనియాంశమైంది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తున్న అధికారులు హడలిపోతున్నారు. ఇటువంటి అధికారుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు ఇటీవల రెడ్‌బుక్‌ ఓపెన్‌చేసి అందులో పలువురు అధికారుల పేర్లు నమోదు చేసుకోవడం సర్వత్రా చర్చనియాంశమైంది.

న్యాయస్థానానికి రెడ్‌బుక్‌ ఇష్యూ
సీఐడీ పోలీసులు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన ఏసీబీ కోర్టు నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. జనవరి 9న తదుపరి విచారణ ఉంటుందంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇది పోలీసు శాఖకు మాత్రమే పరిమితం కాక వైఎస్సార్‌సీపీ అండదండలతో పార్టీకి వీర విధేయులుగా ఉన్న అన్ని శాఖల్లోని అధికారులకు దడపుట్టిస్తుస్తోంది. ఇటీవల కాలంలో అనూహ్యంగా పుంజుకున్న తెలుగుదేశం పార్టీ ఉరకలేస్తున్న ఉత్సాహంతో ముందుకు పోవడంతో అధికార గణం ఒకింత ఆలోచనలో పడింది. ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ లోకేష్‌ గళం పెంచడంతో రెడ్‌బుక్‌ జాబితా పెరుగుతూ వస్తున్నది.
రేయ్‌.. నీపేరు రెడ్‌బుక్‌లో రాసుకుంటారు
అరేయ్‌ కాస్త జాగ్రత్తగా చూసుకోనిపో.. లేకకుంటే నీ పేరు రెడ్‌బుక్‌లో రాసుకుంటారు. అని అధికారుల్లో ఒకరినొకరు సీరియస్‌గా కామెంట్‌ చేసుకుంటున్నారు. టీడీపీ నాయకులు కొందరు నీ పేరు రెడ్‌బుక్‌లో రాపిస్తామని అధికారులను బెదిరిస్తుండటం రెడ్‌ బుక్‌ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. లోకేష్‌ కూడా సభల్లో అవసరం వచ్చిన ప్రతిసారీ రెడ్‌బుక్‌ పట్టుకుని ఇదిగో జాగ్రత్త, రెడ్‌బుక్‌లోకి ఎక్కారంటే మీ పనిపడతా నంటూ బాహాటంగా మాట్లాడటంతో రెడ్‌బుక్‌కు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కొందరు అధికారులు దిద్దుబాటు కార్యక్రమాల్లో పడ్డారు. ఎన్నికలు సమీపించడంతో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. అనధికారికంగా కోడ్‌ అమలులో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ కేసుల వరకు పోవడం సరైందని కాదని, పార్టీ ప్రచారాల్లో ఇవన్నీ మామూలేనని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రెడ్‌బుక్‌ పంచాయతీ ఎంతవరకు దారితీస్తుందనేది వేచి చూడాల్సిందే.
Next Story