టీటీడీని ప్రక్షాళన చేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవోకి చెప్పాం. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు తప్పవు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రెడ్ బుక్ మొదలైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు తప్పవని తాము చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని అన్నారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే సీనియర్ ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారని, రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవో జే శ్యామలరావుకు చెప్పామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తిరుమల లడ్డూ నాణ్యతతో పాటు అనేక సమస్యలను నా దృష్టికి తెచ్చారు. అందువల్ల టీటీడీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని లోకేష్ చెప్పారు. శ్రీకాకుళంలో ఓ పాఠశాల పరిశీలను వెళ్లిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతికి వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందన్నారు. తాము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలను పాటిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ. 250 కోట్లు ఉండాలన్న నిబంధనలను నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు రూ. 150 కోట్లకు తగ్గించి సవరించారని ప్రశ్నించారు. నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీ వేశామన్నారు. పథకాల అమలుపై ఆయన మాట్లాడుతూ మాకు చిత్తశుద్ది ఉందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు.
Next Story