కర్లపాలెం వద్ద ఘోర ప్రమాదం, ఎమ్మెల్యే బంధువులు మృతి
x

కర్లపాలెం వద్ద ఘోర ప్రమాదం, ఎమ్మెల్యే బంధువులు మృతి

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటనx


ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా కర్లపాలెం వద్ద ఇవాళ (నవంబర్ 3) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. వీరందరూ స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులని తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా గుర్తించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సంగీత్ కార్యక్రమం ముగిసిన తర్వాత అంటే ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత వీరు కారులో కర్లపాలెం బయల్దేరారు. సత్యవతిపేట వద్ద ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్లకు ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు చెప్పారు.
అర్థరాత్రి కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వెంటనే ఎవరికీ తెలియలేదు. ప్రమాదం జరిగిన గంట తర్వాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం బాధితులందరూ కర్లపాలెం వాసులు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మృతులను బేతాళం బలరామరాజు(65), బేతాళం లక్ష్మీ ( 60), గాదిరాజు పుష్పవతి( 60), ముదుచారి శ్రీనివాసరాజు( 54)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే సహా పలువురు ప్రమాదం జరిగిన చోటుకి వచ్చి పరిశీలించారు.
Read More
Next Story