నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం ఫోటో గ్యాలరీ
x

నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం ఫోటో గ్యాలరీ

ఈనెల 17వ తేదీ సంధల్ మాల్, 18న గంధ మహోత్సవం, 19న రొట్టెల పండుగ, 20న తలిఫా తేహ, 21న ముగింపు సభతో రొట్టెల పండగ ముగియనుంది.



మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. నేటి నుంచి ఈనెల 21 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుంచి భక్తజనం తరలి రావడంతో దర్గా ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుంది. ఈనెల 17వ తేదీ సంధల్ మాల్, 18న గంధ మహోత్సవం, 19న రొట్టెల పండుగ, 20న తలిఫా తేహ, 21న ముగింపు సభతో రొట్టెల పండగ ముగియనుంది. రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.























Read More
Next Story