ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇది వరకు జారీ చేసిన ఆదేశాలను పొడిగించింది.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జీ సజ్జల భార్గవ్‌రెడ్డి కేసును ఫిబ్రవరికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వాయిదా వేసింది. సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌పై సీనియర్‌ అడ్వకేట్, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సజ్జల భార్గవ్‌రెడ్డి ఎవరుపైన అయితే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్లు ఫిర్యాదులు చేయలేదు. ఎవరో థర్డ్‌ పర్సన్, సంబంధం లేని వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ కంప్లెయింట్‌ ఆధారంగా సజ్జల భార్గవ్‌రెడ్డిపైన సోషల్‌ మీడియా కేసులు పెట్టారు. ఈ పోస్టులపైన ఐటీ సెక్షన్స్‌కు బదులుగా పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్స్‌ పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అని పోలీసులు చెబుతున్నారని, కానీ ఇది అలాంటి నేరమేమి కాదని పొన్నవోలు కోర్టులో వాదనలు వినిపించారు. పొన్నవోలు చేసిన వాదనలు, కోర్టు దృష్టికి తీసుకెళ్లిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తూ.. సజ్జల భార్గవ్‌రెడ్డిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇది వరకు జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.


Next Story