‘ఇదంతా ఎన్నికల గారడీ’.. అమిత్ షా వ్యాఖ్యలపై సజ్జల సీరియస్..
x

‘ఇదంతా ఎన్నికల గారడీ’.. అమిత్ షా వ్యాఖ్యలపై సజ్జల సీరియస్..

కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. షా మాటలన్నీ ఎన్నికల గారడీనేనని కౌంటర్ ఇచ్చారు.


ఆంధ్రలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలవుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి పార్టీ టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు జబ్బలు చర్చుకుంటున్నాయి. కానీ ఈసారి ఆంధ్ర ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోవడం తథ్యమని ఇరు పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. ‘‘ఆంధ్రలో కూటమికి అత్యధిక సీట్లు వస్తాయి. ప్రజలంతా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

గుస్సా అయిన సజ్జల

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. షా మాటలన్నీ ఎన్నికల గారడీనేనని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత చేసుకున్నా ఏమీ ఉండదని, పోలింగ్ పూర్తయింది అంటే ప్రజలు తమ తీర్పు ఇచ్చేశారని ఆయన గుర్తు చేశారు. జూన్ 4న విడుదలయ్యే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అమిషా వ్యాఖ్యలు దేశంలో బీజేపీ ఓటమిని చూపుతున్నాయని అన్నారు.

ఉత్తరాది ఓటర్ల కోసమే

అమిత్ షా ఈ వ్యాఖ్యలు ఆంధ్రుల కోసం చేయలేదని సజ్జల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తర భారతదేశంలోని ఓటరలు ప్రభావితం చేయడానికే ఆయన ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. దక్షిణాదిలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని మాటలు చెప్పి ఉత్తరాదిలో ఓట్లు దండుకోవడనానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే ఆంధ్రలో కూటమే గెలుస్తుందని, పోటీ చేస్తున్న ప్రతి స్థానంలో బీజేపీ గెలుస్తుందని వాళ్లు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని సజ్జల సీరియస్ అయ్యారు.

పొత్తుకు అనుకూలంగానే ఈసీ

ఎన్నికల సంఘంపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తు తర్వాత ఆంధ్రలో చంద్రబాబుకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ ప్రస్తుతం చంద్రబాబు అనే వైరస్‌ బారిన పడి ఉందని దుయ్యబట్టారు. ఇందుకు పిన్నెల్లి లీక్ వీడియోనే నిదర్శనమని, ఆరోజు ఏడు ప్రాంతాల్లో విధ్వంసం జరిగే పిన్నెల్లి వీడియో మాత్రమే బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా ఈసీకి తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు.

తాత్కాలిక ఆనందాలు లక్ష్యం కాదు

ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి ఎంతో సమయం లేదని, ఇంతలోనే నోటికి వచ్చింది చెప్పి తాత్కాలిక ఆనందం పొందాలని తాము అనుకోవడం లేదని సజ్జల స్పష్టం చేశారు. సీఎస్‌ను తప్పించాలని టీడీపీ వాళ్లు ఎంతో ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక్క వారం రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ అవుతుందంటూ సజ్జల మండిపడ్డారు.

Read More
Next Story