తిరుపతి నియోజకవర్గంలో ‘సంచారి’ ఓటర్ చైతన్య కార్యక్రమం
x

తిరుపతి నియోజకవర్గంలో ‘సంచారి’ ఓటర్ చైతన్య కార్యక్రమం

18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు మొదటి సారిగా వినియోగించుకునే దిశలో సంచారి స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి ఓటర్ల ను జాగృతి పరిచే కార్యక్రమాలు చేపడుతూ ఉంది.


18 ఏళ్లు నిండిన(18+) యువతకు ఓటు హక్కు మొదటి సారిగా వినియోగించుకునే దిశలో సంచారి (Sanchari) స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి పార్లమెంట్ పరిధిలో 'భవిష్య భారత్ ' శీర్షికన గత కొన్ని నెలలుగా ఓటర్ల ను జాగృతి పరిచే కార్యక్రమాలు చేపట్టింది.


ఇందులో భాగంగా ఈ రోజు సూళ్ళూరు పేట సరిహద్దు గ్రామాలైన వట్టంబేడు కుప్పం, తడ కొత్త కుప్పం,సెల్వి కుప్పం నుండి వచ్చిన మత్స్యకార వయోజన విద్యార్థులతో నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో డాక్టర్ దాసరి శ్రీనివాసులు, సంచారి స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.


18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ గుత్తా కోరారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు (పూనా ఒప్పందం) ఓటింగ్ రైట్స్ లో నెలకొన్న వివక్షతను వివరిస్తూ,భారత రాజ్యాంగం అమలు దిశలో డా. బిఆర్ అంబేద్కర్ ప్రతి వయోజనుడు ఓటు హక్కు పొందే విధంగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడం దేశ సమగ్రతకు సౌభ్రాతృత్వానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు. ఇందుకు యువత దోహదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్య క్రమాన్ని రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి నిర్వహణలో జరిగింది. జాతీయ మత్స్యకార అభివృది మండలి సభ్యులు పోలయ్య కొలంగారి మరియు మత్స్య కార జిల్లా నాయకులు పాల్గొనటo జరిగింది.

స్థానిక యువత సహకారంతో సంచారీ సంస్థ గత సంవత్సర కాలంగా దాదాపు 27 వేల మంది కొత్త ఓటర్ల నమోదు లక్ష్యం సాధించిందని వివరించారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్య కారులు,యానాదులు మరియు సంచార జాతుల సమూహాలను గుర్తించి ప్రత్యేకంగా దృష్టి సారించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించినట్లు వెల్లడించారు.

తాము చేస్తున్న ప్రయత్నంతోపాటు ప్రభుత్వం ఎన్నికల సంఘం ఓటు పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసికెళ్ళి ఓటింగ్ విషయ పరిజ్ఞానం కల్పించే దిశగా సదస్సులు నిర్వహించటం జరిగిందని తెలియ జేసారు.

ప్రత్యేకించి 28 ఏప్రిల్ నుండి 10 మే 2024 వరకూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ వర్గాలు నివాసం ఉంటున్న గ్రామాల్లో వారి వారి కాలనీల్లో 10 మంది 18+ ఓటర్లు ఉండేటట్టు ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించటం జరుగుతుంది. ఒక రోజు తీర ప్రాంత మత్స్యకార

కుప్పాలలో, మరుసటి రోజు యానాది గిరిజన ప్రాంతాల్లో,ఆ మరుసటి రోజు సంచార(de-notified tribes) జాతులతో క్రమం తప్పకుండా ముఖా ముఖి సమావేశాలు జరిగేలాగున స్పెషల్ డ్రైవులు చేపట్టటం ప్రత్యేకత. ప్రసంగాలకు తావు లేకుండా పర్టిసిపేటివ్ మోడ్ లో యువతను ఆకట్టుకోవటం ఆసక్తి కరం. ప్రొద్దున్నే ఒక సెషన్ సాయంత్రం రెండో సెషన్ స్థానికులకు అనుకూలంగా ఉండేటట్లుగా టైం టేబుల్ తయారు చేసి ముందుగానే ఓటర్లకు తెలియ జేయడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి యువతీ యువకుడు తమ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చె విధంగా ప్రతి సెషన్ రెండు గoటలు మించకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.


స్థానిక కుల సంఘ నాయకుల సహకారంతో, ఆయా ప్రాంతాల్లో చురుకుగా పని చేస్తున్న సేవా సంస్థల సహాయంతో, విద్యార్థి నాయకులను సమ్మిళతం చేసి అర్థ వంతంగా నిర్వహించటం ప్రత్యేకత.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు జిల్లా యంత్రాంగం రూపొందించిన 'గైడ్ టు ఓటర్స్ ' మరియు సంబంధిత ప్రింట్ మెటీరియల్, కరపత్రాలు యువత కు అందజేయటం కూడా జరుగుతుంది ఈ దిశగా.

యువతే దేశ భవిష్యత్తు, వారి ఆలోచనలే ఆచరణీయాలు...సంకల్ప భారత్-సమృద్ధి భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఈ పర్యటనలో భాగం.


Read More
Next Story