మిషన్ కాంబోడియాపై బాబు కామెంట్.. సీఎస్ తీరు శోచనీయం..
x

మిషన్ కాంబోడియాపై బాబు కామెంట్.. సీఎస్ తీరు శోచనీయం..

మిషన్ కాంబోడియాపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంలో సీఎస్ తీరు శోచనీయమని అనుమానం వ్యక్తం చేశారు.


మానవ అక్రమ రవాణాపై దృష్టిసారించాలని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర సీఎస్‌ జవహర్ రెడ్డిని కోరారు. వందల మంది తెలుగు యువకులను మాయమాటలు చెప్పి కాంబోడియాకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ వారిని చిత్ర హింసలు పెడుతున్నారని, వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకురావాడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘ఉపాధి హామీలు కల్పిస్తామని చెప్తూ నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి వారిని కాంబోడియాకు తరలిస్తున్నారు. అక్కడ వారిని చిత్రవధ చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారికి తెలియదా..

రాష్ట్ర యువకులను కొన్ని నకిలీ ఏజెన్సీలు టార్గెట్‌గా ఇంత మోసం చేస్తున్నా అధికారులు తెలియలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలియదా? తెలిసినా తెలియనట్లు ఉంటున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఎన్ఐఏ విచారణలో బయటపడింది. అయినా యువకులను తిరిగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు శోచనీయంగా ఉంది. ఇప్పటికైనా వారిని తిరిగి ఆంధ్రకు తీసుకురావడానికి కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా’’ అని వివరించారు.

కొనసాగుతున్న ఆపరేషన్ కాంబోడియా

కాంబోడియా చిక్కుకున్న విశాఖ వాసులను రక్షించడానికి తీసుకున్న చర్యే ఈ ఆపరేషన్ కాంబోడియా. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ మొదటి రోజున 25 మంది విశాఖ వాసులకు విముక్తి కల్పించారు. ఇంకా కాంబోడియాలో 33 మంది విశాఖ వాసులు చిక్కుకుని ఉన్నారు. మిగిలిన వారిని కూడా దశలవారీగా రక్షిస్తామని విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ చెప్పారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మూలాలను ఎస్ఐటీ బృందాలు వెలికి తీస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే దాదాపు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే 70 ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన వెల్లడించారు.

వాళ్లే లక్ష్యం

ఉద్యోగ వేటలో ఉన్న యువతే లక్ష్యంగా కొన్ని నికిలీ ఏజెన్సీలు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాయి. వారికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్న ఆర్దిక ఇబ్బందులకు ఏడాదిలో తీర్చుకోవచ్చని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. తీరా వారిని కాంబోడియాకు తరలిస్తున్నారు. అక్కడ చైనా మాయగాళ్ల చేతిలో పెడుతున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న తెలుగు యువకుల పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్లు లాగేసుకుంటున్న ఆ కేటుగాళ్లు వీరి చేత తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని తమ దర్యప్తులో తేలినట్లు పోలీసులు వివరించారు.

Read More
Next Story