ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఓ యువకుడు తీసుకున్న సెల్పీ వీడియో తూర్పు గోదావరి జిల్లాలో కలకరం రేపింది.


నేటి యువత ఆన్‌లైన్‌ జూదానికి బానిసలుగా మారడం, బెట్టింగ్‌ల కోసం లక్షల్లో అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడటం, అప్పులు తీర్చక పోతే కుటుంబ సభ్యులను చంపేయడం, అప్పులు తీర్చలేక ఇళ్లల్లో నుంచి పరారు కావడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి సంఘటనలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దురలవాట్లకు బానిసలుగా మారుతున్న యువత వల్ల అకారణంగా కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు. సమాజంలో పరువు పోగొట్టుకుంటన్నారు. చివరకు కన్న కొడుకుల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి సంఘటనే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు బానిసైన ఓ యువకుడు భారీ ఎత్తున అప్పులు చేశారు. అప్పులు చేసిన డబ్బులన్నీ ఆన్‌లైన్‌ జూదంలో పోగొట్టుకున్నాడు. అప్పులు లక్షల్లో ఉండటంతో వీటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక సెల్పీ వీడియో తీసి దానిని బంధువులకు పంపించాడు. ఇప్పుడు ఈ వీడియో పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. వైరల్‌గా మారడంతో ఎవరా యువకుడు అని చర్చించుకుంటున్నారు.
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యూప్‌లల్లో డబ్బులు పోగొట్టుకున్నానని, అప్పులు చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లల్లో పెట్టానని, లక్షల్లో డబ్బులు పోయాయని, ఇప్పుడు అప్పులు తీర్చే మార్గం లేక పోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, పేరుపాలెం బీచ్‌లో చనిపోతున్నానంటూ ఓ యువకుడు సెల్పీ వీడియో తీసి బంధువులకు పంపాడు.
దీంతో ఆందోళనలకు గురైన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులతో పాటు పోలీసులు రంగంలోకి దిగి గాలింపులు చేపట్టారు. మొగల్తూరు పోలీసులు పేరుపాలెం బీచ్‌లో గాలింపులు చేపట్టారు. పేరుపాలెం బీచ్‌లో సముద్రం ఒడ్డున ఉన్న బైక్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ బైక్‌ ఆ యువకుడిదే అని పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసిన యువకుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ యువకుడి ఆచూకీ ఇంకా లభించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు బానిసైన కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన దుర్ఘటన ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసైన కొడుకు పుల్లారావు నాలుగు లక్షలకుపై అప్పులు చేశాడు. అప్పు తీర్చమని తండ్రి శ్రీనివాసరావు మీద ఒత్తిడి తెచ్చాడు. తీర్చాలని అనుకున్నా ఆ తండ్రి ఆన్‌లైన్‌ జూదం మంచిది కాదని కొడుకు పుల్లారావును వారించాడు. పలుమార్లు మందలించాడు. అప్పటికీ మారకపోవడంతో కొడుకు పుల్లారావు చేసిన అప్పులను తీర్చేందుకు తండ్రి శ్రీనివాసరావు నిరాకరించాడు. దీంతో తండ్రిని ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఒకే వేటుకు ఎలా చంపాలనే దానిపై యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశాడు. పొలంలో ఉన్న తండ్రిని పథకం ప్రకారం ఈ నెల 8న ఒకే వేటుకు కర్రతో మోది చంపేశాడు. దీంతో ఆన్‌లైన్‌ జూదానికి కొడుకు బానిసైన కారణంగా ఇంటి పెద్ద దిక్కు తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డున పడింది.
Next Story