జగనన్నా ఈ 7 ప్రశ్నలకు జవాబు చెప్పన్నా? : షర్మిల
అన్న కు చెల్లెలు వేసిన ఏడు ప్రశ్నలు. దీనికి జవాబు వస్తుందా, లేక మౌనమే జవాబా: ఇవే ప్రశ్నలు
వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తా...మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా...విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటా అంటూ అంటూ విజన్ విశాఖ, ఫ్యూచర్ వైజాగ్ పేరిట విశాఖలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలు సదస్సులో ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రాజధాని చర్చను మళ్లీ రేకెత్తించారు. అయిదేళ్లలో విశాఖ రాజధాని కల నెరవేర్చలేకపోయారన్నది వాస్తవం. అయితే, ఇపుడు ఎన్నికల ముందు జగన్ చెప్పిన రాజధాని కబుర్ల మీద కాంగ్రెస్ ఆంధ్రా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలడుగుతున్నారు. వాటికి సమాధానం కావాలంటున్నారు.
ట్విట్టర్ నుంచి షర్మిల వేసిన ప్రశ్నలు ఇవే.
1. (విశాఖ) పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
2. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ కాదా.
3. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాపా
4. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజనా
5. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికలా.
6. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్.
7. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో ..కొత్త నాటకాలు కాదా ?
Next Story