జగనన్నా.. ఒక్కసారి ప్రశ్నించుకోండి..
x
Source: Twitter

జగనన్నా.. ఒక్కసారి ప్రశ్నించుకోండి..

వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు ఇంకా బయటకు రాలేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ విషయంపై జగన్ ఒకసారి అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోవాలన్నారు.



ఆంధ్ర రాజకీయాల్లో వివేకానందరెడ్డి హత్య మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకి వచ్చి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని లేవనెత్తుతూ నేతలు సీఎం జగన్‌పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేతల జాబితాలో తాజాగా ఆయన సోదరి, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా చేరారు. అన్నా అని పిలుచుకునే వారే హంతకులను రక్షిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వివేకా హత్య వెనక జగన్ హస్తం ఉందన్న అనుమానాలను మరోసారి రేకెత్తిస్తున్నాయి. ‘హూ కిల్డ్ బాబాయ్’ నినాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


ఎక్కువ నష్టపోయింది వారే


చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత అత్యంత ఎక్కువగా నష్టపోయారని కడపలో నిర్వహించిన వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న హత్య కేసులో ఇంకా అసలు వాస్తవాలు బయటకు రాలేదని, ఆయన మరణం కుటుంబానికి, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రసంగిస్తూనే ఆమె జగన్‌పైకి విమర్శనాస్త్రాలు సంధించారు.


బంధువులే హంతుకులు


చిన్నాన్న హంతకులు బంధువులేనని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ‘‘బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేక పోగా ఆరోపణలు చేస్తారా? ఇప్పటివరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. ఆఖరి క్షణం వరకు చిన్నాన్న పార్టీ కోసమే పని చేశారు. జగనన్నా.. ఒక్కసారి అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఎంత చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారు?’’అని నిలదీశారామే.


హంతకుల్ని జగనే కాపాడుతున్నారు


వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త హత్యపై అనేక అనుమానాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ‘‘నా భర్తను రాజకీయ కారణాలతోనే హత్య చేశారు. తండ్రిని చంపిన హంతకుల్ని చట్టం ముందు నిలబెట్టడానికి నా కుమార్తె సునీత పోరాటం చేస్తోంది. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సింది పోగా జగన్ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసును పట్టించుకోలేదు. పైగా న్యాయం కోసం ఆయన దగ్గరకు వెళ్లిన నా కుమార్తెను దారుణంగా అవమానించారు’’ అని ఆమె ఆవేదన చెందారు.

‘‘వివేకా హత్య కేసులో నా కుమార్తె, అల్లుణ్ణి ఎందుకు అనుమానించకూడదంటూ మాట్లాడారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే ఆఖరి క్షణంలో కూడా హంతకులకు శిక్షపడేలా చేయడానికి సహకరించాలని సునీత.. జగన్‌ను కోరింది. అప్పుడు జగన్ పట్టించుకోలేదు. నా భర్త హంతకులకు రక్షిస్తోంది జగనే అన్న అనుమానాలూ ఉన్నాయి. శత్రువులు ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించాం’’అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన భర్త హంతకులకు ఇంకా శిక్షపడకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్‌ఎస్ వైపు మాత్రమే ఉంటారు. మతపరమైన రాజకీయాలు చేసే బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం లేదు. బీజేపీ నాయకుల కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి. బీఆర్‌ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్‌లు మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌కు ప్రతినిధులు” అని అన్నారు. నిజానికి బీఆర్‌ఎస్ గాని, కాంగ్రెస్ గాని తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్నికల్లో ప్రయోగించడం లేదు. కాంగ్రెస్ ఆరు హామీలను అమలుచేసి ఎన్నికలకు పోతూ ఉంటే, బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ వైఫల్యం మీద ప్రచారం చేయాలనుకుంటూ ఉంది. అందువల్ల బీజేపీ తెలంగాణ అంశాన్ని ప్రయోగించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంది.



Read More
Next Story