కడప బరిలోనే వైఎస్ షర్మిల..
x
Source: Twitter

కడప బరిలోనే వైఎస్ షర్మిల..

కడప ఎంపీ స్థానంలో పోటీకి షర్మిల పేరు ఖరారైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఇడుపులపాయలో షర్మిల ప్రకటించనున్నారు.


కడప రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. కడప బరిలోనే వైఎస్ షర్మిల తలపడనున్నారు. సోమవారం కాంగ్రెస్ జాతీయ ఎలక్షన్ కమిషన్‌తో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ సమావేశంలో తన పోటీని ఖరారు చేసుకున్నారు. కడప బరిలో షర్మిలను నిలబెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుతం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పార్టీ సీఈసీ తరపున పాల్గొన్నారు. ఈ సమావేశంలో 5 ఎంపీ, 114 ఎమ్మెల్యే అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. ఆ అభ్యర్థుల జాబితాను షర్మిల ఈరోజు ఇడుపులపాయలో ప్రకటించనున్నారు.

ఇందులో భాగంగా కడప ఎంపీ స్థానంలో షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, విశాఖ నుంచి సత్యారెడ్డి, కాకినాడ నుంచి ఎంఎం పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే కమ్యూనిస్టు పార్టీలతో సర్దుబాటు జరగాల్సిన ఉన్న నేపథ్యంలో మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయడానికి ప్రస్తుతం షర్మిల.. కడప జిల్లాలకు వెళ్తున్నారు.

Read More
Next Story