తన సర్వీసు రివాల్వర్‌తోనే తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


తనకు ఏమి కష్టమొచ్చిందో కానీ.. ఓ ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పది మంది సమస్యలు తీర్చి భరోసా కల్పించాల్సిన ఆ ఎస్‌ఐ తన తుపాకీతో తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యంత బాధాకరమైన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి శుక్రవారం ఉదయం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది, బంధువులు ఆ ఎస్‌ఐ మృతదేహాన్ని 108 వాహనంలో తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తణుకు రూరల్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న ఏజీఎస్‌ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గేదెల అపహరణ కేసులో పలు ఆరోపణలు వచ్చాయి. ఇవి కాస్త పోలీసు ఉన్నత అధికారుల వద్దకు చేరాయి. ఆరా తీసిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తిని ఇటీవలె సస్పెండ్‌ చేశారు. దీంతో ఎస్‌ఐ మూర్తి ప్రస్తుతం వీర్‌లో ఉన్నాడు.
అయితే శుక్రవారం ఉదయం పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో తణుకు పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. తర్వాత కొంత సేపు అక్కడే కూర్చుకున్నాడు. తనపై ఆరోపణలు రావడం, దీంతో అధికారులు తనను సస్పెండ్‌ చేయడం ఎస్‌ఐ మూర్తి జీర్ణించుకోలేక పోయాడు. వీటిని అవమానంగా ఫీలయ్యాడు. ఈ సమస్యల నుంచి గట్టెకొచ్చనే ఆలోచనలు పక్కన పెట్టాడు. తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి చివరికి తన సర్వీసు రివాల్వర్‌తోనే తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల్లో కలకలం రేపుతోంది.
Next Story