
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్?
మారేడుమిల్లి అడవుల్లో తుపాకులు మార్మోగుతున్నాయి. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్టు అల్లూరి జిల్లా కేంద్రానికి మంగళవారం సమాచారం అందింది.
మారేడుమిల్లి అడవుల్లో తుపాకులు మార్మోగుతున్నాయి. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్టు అల్లూరి జిల్లా కేంద్రానికి మంగళవారం సమాచారం అందింది. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈవేళ తెల్లవారుజాము నుంచి జరుగుతున్న కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్టు అనధికార వర్గాల సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు టీవీ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్ర నేతలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేతలు మరణించినట్టు సమాచారం. అయితే అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పలు చోటుచేసుకున్నాయి.
Next Story

