సోషల్ మీడియా రాణులు...వైపీపీకి వంతపాడి అల్లరైపోయారు!
x
Source: Twitter

సోషల్ మీడియా రాణులు...వైపీపీకి వంతపాడి అల్లరైపోయారు!

సోషల్ మీడియాలో మహారాణుల మారిన వారు. ఓ పార్టీకి వంత పాడటంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. వారెవరంటే..


(శివరామ్)

నిన్న మొన్నటి వరకు వారంతా సోషల్ మీడియా రాణులు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే లక్షల్లో లైక్‌లు. వేలల్లో కామెంట్లు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లుగా ముద్ర పడడంతో లక్షల్లో గడించారు. వీరు ఏం చేస్తే అదే ట్రెండ్.. అదే ఫ్యాషన్. ఎప్పుడు ఏ పోస్టు పెడతారా అని వేల సంఖ్యలో అభిమానుల ఎదురు చూపులు. చివరకు ఈవెంట్లలోనూ, షాపుల ప్రారంభోత్సవాల్లోనూ వీరిదే హవా. అంతవరకు బాగానే ఉంది. తాజాగా వీళ్లు ఓ అధికార పార్టీ పంచన చేరడంతో సోషల్ మీడియాలో అల్లరై పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

వైసీపీ పంచన చేరారు... ఆవిరైపోయారు..

అటువంటి ఈ మహారాణుల ప్రభావం ఒక్క దెబ్బతో ఆవిరైపోయింది. సజ్జల భార్గవ్ నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్రంలోని సోషల్ మీడియాను బాగా ప్రభావితం చేస్తూ, లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న వారిని (ఇన్ఫులెన్సియర్లు) గుర్తించింది.. ఆకట్టుకుంది. తమవైపు లాక్కుంది. నెల నెలా సోషల్ మీడియా నుంచి వచ్చే ఆదాయం కంటే ఒక్కసారిగా ఎదురుగా కనిపిస్తున్న కట్టల మీద మోజు కలిగింది. రోజువారీ కార్యక్రమాలు, ఈవెంట్‌లతో పాటు వైసీపీకి వంత పాడారు. వైపీపీ సోషల్ మీడియా సమావేశాలకు హాజరై జగన్ ప్రసంగాలతో పాటు వైసీపీ ప్రచార కార్యక్రమాల పోస్టులు పెట్టడం ప్రారంభించారు. అంతే సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఒక్క సారిగా ఆవిరైపోయింది. ఇంతకాలం ఆహా .. ఓహో.. అద్బుతం.. అన్న జనం ఇప్పుడు ఛా,ఛీ అంటూ.. అమ్ముడుపోయావా అమ్మడూ? పెయిడ్ ఆర్టిస్ట్ వా చెల్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అమ్ముడు పోయావా అమ్మడూ...

ఇంతకాలం వీరు మంచి డ్రెస్ వేసినా, పాట పాడినా, డాన్స్ చేసిన, ఈవెంట్‌లో పాల్గొన్నా ఆహా ఓహో.. అద్భుతం అంటూ వేలల్లో కామెంట్లు, లక్షల్లో లైక్‌లు వచ్చేవి. వీరు ఎప్పుడైతే వైసీపీ భజన ప్రారంభించారో నెటిజన్లు బూతులు, విమర్శలు ప్రారంభిచారు. పెయిడ్ ఆర్టిస్ట్ వా.. ఎంతకు అమ్ముడుపోయావ్.. ఛీ ఛీ..ఇదేం బ్రతుకు అంటూ ఒకటే తిట్లు, దారుణమైన వ్యాఖ్యలు. దీంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిన వీరు మరో గత్యంతరం లేక, భరించలేక ఇన్ స్టాలో , ఎక్స్‌లో కామెంట్ ఆప్షన్‌ను బ్లాక్ చేసేసుకొన్నారు. తీసుకున్న లక్షల కోసం వైసీపీ భజన చేయక తప్పడం లేదు. అలా అని తిట్లూ, శాపనార్ధాలు భరించలేరు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

7.5 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నా వేయి లైక్‌లే...

పల్లెపోగు శ్రుతికి pallepogu_sruthi ఇన్ స్టాలో 734 వేల ఫాలోవర్స్ ఉన్నారు. వైసీపీ ప్రచారానికి ఒప్పుకోవడంతో ఒక్కసారిగా అభిమానులే తిట్ల దండకం అందుకొన్నారు. చేసేది లేక అభిమానులు స్పందించే అవకాశం ఇవ్వకుండా కామెంట్ ఆప్షన్ మూసేశారు. మంగళవారం విశాఖలో జరిగిన వైసీపీ సోషల్ మీడియా సమావేశం వీడియో ఆమె పోస్టు చేసి 16 గంటలైనా వచ్చిన లైక్‌లు వేయ్యే కావడం ఆమె దుస్ధితిని తెలియజేస్తుంది. 452 వేల మంది ఫాలోవర్స్ ఉన్న ప్రీతీప్రియ preethipriya926 పరిస్థితి ఇదే. తిట్లు భరించలేక కామెంట్ ఆప్షన్ మూసేశారు. 324 వేల ఫాలోయర్స్ ఉన్న సాయి చాందినీ saichandhiniofficial9 , 140 వేల ఫాలోయర్స్ వున్న స్వప్నా రెడ్డి swapna.reddyy తదితరులు కూడా కామెంట్‌ను ఆప్షన్ తీసేసి భయం భయంగా పోస్టింగ్‌లు పెడుతున్నారు.

Read More
Next Story