Dowry harassment | అన్నమయ్య జిల్లాలో మామ ముక్కు కోసిన అల్లుడు
x

Dowry harassment | అన్నమయ్య జిల్లాలో మామ ముక్కు కోసిన అల్లుడు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యను వ్యక్తి కట్నం వేధించాడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన ఇది.


ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు చక్కగానే ఉన్నాడు. నెల తిరగక ముందే ఆలోచనలు దారిమళ్లాయి. కట్నం తీసుకుని రావాలని వేధింపులు ప్రారంభించాడు. విచక్షణ మరిచి భార్యపై దాడికి దిగాడు. దీనిని భరించలేక అడ్డువచ్చిన ఆ యువతి తల్లిదండ్రులపై కూడా దాడికి దిగాడు. మానవత్వం మరిచిన ఆ అల్లుడు తన మామ ముక్కు కొరికాడు. అడ్డు వచ్చిన అత్త కాళ్లు చేతులు విరిచినంత పని చేశాడు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం (Pedda Tippa Samudram) లో జరిగింది. అల్లుడు దాడిలో గాయపడిన మామ మదనపల్లె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే, అత్తను మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఎస్వీఆర్ఆర్ ( Sri Venkateswara Ram Narayan Ruia Government General Hospital ) కు తరలించారు. బాధితులు తెలిపిన వివరాలివి.
ఏమి జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పిటిఎం మండలం, బూచిపల్లికి చెందిన జర్ర గంగాధర్ లక్ష్మీనరసమ్మ దంపతుల కుమార్తె గాయత్రిని అదే ఊరిలో ఉన్న విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెల కూడా తిరగకనే అదనపు కట్నం కోసం వేధిస్తూ కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అల్లుడు కూతుర్ని కొడుతుండగా మామ గంగాధర్, అత్త లక్ష్మీనరసమ్మ వెళ్లి అడ్డుకున్నారు. దీంతో అత్తమామలపై అల్లుడు విజయ్ విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులను కుటుంబ సభ్యులు చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రి (Madanapalle District Government Hospital ) కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం లక్ష్మీనరసమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తిరుపతికి రెఫర్ చేశారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలో బాధితురాలు లక్ష్మీనరసమ్మ కాళ్లుచేతులు కదపలేని స్థితిలో బాధను పంటి బిగువన భరిస్తూ , మీడియాతో మాట్లాడింది. "మా అల్లుడే దాడి చేశాడు. నా కూతురిని కూడా బాగా కొట్టాడు" అని కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. పీటీఎం ఎస్ఐ హరిహరప్రసాద్ ఈ విషయం చెప్పారు. అత్తామామలపై దాడికి పాల్పడిన విజయ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Read More
Next Story